53 శాతం రికవరీ అయిపొయింది.. లీడర్..!

  • September 16, 2019 / 12:35 PM IST

‘మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్ పై విక్రమ్.కె.కుమార్ డైరెక్షన్లో రూపొందిన తాజా చిత్రం ‘నానీన్ గ్యాంగ్ లీడర్’. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ అనే కొత్త హీరోయిన్ టాలీవుడ్ కు పరిచయమైంది. ‘ఆర్.ఎక్స్.100’ హీరో కార్తికేయ ఈ చిత్రంలో విలన్ గా నటించాడు. సెప్టెంబర్ 13 న విడుదలైన ఈ చిత్రానికి మొదట డివైడ్ టాక్ వచ్చింది. అయితే నాని మార్క్ ఎంటర్టైన్మెంట్ ఉంది కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ ఈ చిత్రం చూడటానికి ఎగబడ్డారు. దీంతో ఫస్ట్ వీకెండ్ ఈ చిత్రానికి మంచి వసూళ్ళు వచ్చాయి.

ఇక ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్ ఏరియా వైజ్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం – 4.74 కోట్లు
సీడెడ్ – 1.22 కోట్లు
ఉత్తరాంధ్ర – 1.57 కోట్లు


ఈస్ట్ – 1.06 కోట్లు
వెస్ట్ – 0.69 కోట్లు
గుంటూరు – 1.03 కోట్లు


కృష్ణా – 0.93 కోట్లు
నెల్లూరు – 0.36 కోట్లు


——————————————————-
ఏపీ + తెలంగాణ

టోటల్ – 11.60 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా – 1.4 కోట్లు

ఓవర్సీస్ – 2.8 కోట్లు
——————————————————–
వరల్డ్ వైడ్ టోటల్ – 15.8 కోట్లు (షేర్)
——————————————————–

‘నానీస్ గ్యాంగ్ లీడర్’ చిత్రానికి 28 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యేసరికి 15.8 కోట్ల షేర్ వచ్చింది. అంటే 53 శాతం రికవరీ అయిపొయింది. ఇంకా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 13 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఈ చిత్రానికి అసలు పరీక్ష ఈరోజు నుండీ మొదలు కానుంది. వీక్ డేస్ లో ఈ చిత్రం చాలా వరకూ రాబట్టాల్సి ఉంది. ఎందుకంటే సెప్టెంబర్ 20 న ‘వాల్మీకి’ రంగంలోకి దిగుతున్నాడు. ఆ చిత్రం విడుదలైతే ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ కలెక్షన్ల పై పెద్ద దెబ్బే పడుతుంది. మరి మొదటి వారం పూర్తయ్యేసరికి ఈ చిత్రం ఎంతవరకూ కలెక్ట్ చేస్తుందో చూడాలి..!

గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
పహిల్వాన్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus