మంచి కథ దొరికితే యాంగ్రీ యాంగ్ మ్యాన్ రాజశేఖర్ ఎలా చెలరేగిపోతారో పీఎస్వీ గరుడ వేగ నిరూపించింది. ఇందులో ఎన్.ఐ.ఏ అధికారిగా అతని నటన అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ రిలీజ్ రోజు నుంచి మంచి కలక్షన్స్ తో దూసుకుపోతోంది. జ్యో స్టార్ ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ పై కోటేశ్వర రాజు, మురళి శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమా మొదటి 5 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 15 కోట్లను వసూలు చేసిన ఈ చిత్రం 10 రోజులకు గాను 22 కోట్లు వసూలుచేసింది. ఈ వీకెండ్ నాటికీ పాతిక కోట్ల మార్క్ ని క్రాస్ చేయనుంది.
రీసెంట్ గా మహేష్ బాబు ఈ సినిమా స్క్రిప్ట్ అద్భుతంగా ఉందని చెప్పడంతో కలక్షన్స్ పుంజుకున్నాయి. దీంతో చిత్ర యూనిట్ చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా రాజశేఖర్ ఫ్యామిలీ విజయాన్ని ఆస్వాదిస్తోంది. దర్శకుడు ప్రవీణ్ సత్తారుకు భారీ ఆఫర్లు వస్తున్నాయని ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు. రాజశేఖర్ నెక్స్ట్ ఏ సినిమా చేయనున్నారనే చర్చ సినీ వర్గాల్లో మొదలయింది.