ప్రకంపనలు పుట్టిస్తున్న ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ టీజర్!!!

నందమూరి అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న నందమూరి నట సింహం బాలయ్య ప్రతిష్టాత్మక 100వ చిత్రం “గౌతమీ పుత్ర శాతకర్ణి” టీజర్ దసరా పండగ సందర్భంగా అభిమానుల ముందుకు వచ్చింది…

ఇప్పటికీ ఫస్ట్ లుక్ తో ఇండస్ట్రీ నో షాక్ చేసిన బాలయ్య శాతకర్ణి ఈ టీజర్ తో మరింత ఉత్సాహాన్ని ఇస్తూ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ముఖ్యంగా ఈ టీజర్ స్టార్టింగ్ లో బాలయ్య గుర్రంపై దూసుకెళ్తూ…”విరామం లేదు విశ్రాంతి లేదు”.. అంటూ చెబుతున్న డైలాగ్ వింటుంటే ఈ కధలో బాలయ్య పాత్ర ఎంత వేగవంతంగా ఉంటుంది…స్క్రీన్ప్లే ఎంత వేగంగా నడుస్తుందో అర్ధం అవుతుంది…అదే క్రమంలో వచ్చే మరికొన్ని డైలాగ్స్ బాలయ్య స్టామినా ఏంటో మరోసారి నిరూపించారు. 100 వ సినిమా చేస్తున్నప్పటికీ…అయిదు పదుల వయసు దాటినప్పటికీ బాలయ్య డైలాగ్ లో గాంభీర్యం…ఆయన నటనలో ఆహార్యం ఎక్కడ తగ్గలేదు అనే చెప్పాలి…ఇక ఇప్పటికే ఈ టీజర్ లో డైలాగ్స్ ఆన్లైన్ లో వైరల్ అవుతూ హల్చల్ చేస్తున్నాయి… ఇక బాలయ్య లుక్స్ విషయానికి వస్తే…అభిమానులు మరోసారి తల ఎత్తుకుని ” బాలయ్యా నీకు నువ్వే సాటి…నీకెవ్వరూ రారు పోటీ” అన్నట్లుగా తీర్చి దిద్దాడు క్రిష్….

టీజర్ డైలాగ్స్ లో హల్చల్ చేస్తున్న డైలాగ్స్ ఇవే…
“విరామం లేదు విశ్రాంతి లేదు”
“నా కత్తికంటిన నెత్తుటి చార ఇంకా పచ్చిగానే వుంది..”
“సమయం లేదు మిత్రమా,
శరణమా.. రణమా ?”

ఈ టీజర్ కు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే…సంక్రాంతికి సందడి అంతా నందమూరి అభిమానులదే అని ఇట్టే తెలిసిపోతుంది..

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus