ధృవ నక్షత్రంతో గౌతమ్ మీనన్ ప్రయోగం!

  • November 2, 2017 / 11:28 AM IST

“బాహుబలి” చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయడం అటు మార్కెటింగ్ పరంగా ఇటు కలెక్షన్స్ పరంగా బాగా హెల్ప్ అయ్యింది. అయితే.. అలా రెండు భాగాలుగా సినిమాలను విడుదల చేసే సదుపాయం అన్నీ సినిమాలకు సెట్ అవ్వదు. “బాహుబలి” తర్వాత కొన్ని తమిళ చిత్రాలు రెండు భాగాలుగా విడుదలయ్యేందుకు ప్రయత్నించినప్పటికీ ఏదీ సత్ఫలితాన్నివ్వలేదు. దాంతో దర్శకనిర్మాతలు ఆ ప్రయత్నాన్ని మానుకొని ఎప్పట్లానే రెండున్నర గంటల సినిమాలు తీస్తూపోతున్నారు.

అయితే.. విక్రమ్ కథానాయకుడిగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తమిళ చిత్రం “ధృవ నచ్చతీరమ్” (తెలుగులో “ధృవ నక్షత్రం”) ను మూడు భాగాలుగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అసలు సినిమా రిలీజ్ అవుతుందో లేదో అన్న సందిగ్ధంలో టీం ఉండగా.. గౌతమ్ మీనన్ ఇప్పుడు ఉన్నట్లుండి మూడు భాగాలుగా సినిమా రిలీజ్ చేయాలనుకొంటున్నాను అని ప్రెస్ స్టేట్ మెంట్ ఇవ్వడంతో అందరూ షాక్ అయ్యారు. ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో కథానాయికగా తెలుగమ్మాయి రీతువర్మ నటిస్తుండడం విశేషం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus