తెలుగు రాష్ట్రాల్లో గీత గోవిందం రెండు రోజుల్లో సాధించిన వసూళ్లు

  • August 17, 2018 / 03:15 PM IST

అర్జున్ రెడ్డి సినిమా తర్వాత థియేటర్లోకి వచ్చిన విజయ్ దేవరకొండ మూవీ గీత గోవిందం. పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 15 రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. కన్నడ బ్యూటీ రష్మిక తన అందం, అభినయంతో యువతని విపరీతంగా ఆకట్టుకుంటోంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు 5 .8 కోట్ల షేర్ ని రాబట్టి రికార్డు సృష్టించింది. పనిదినం అయినప్పటికీ రెండో రోజు(గురువారం) కూడా అదే జోరు కనబరిచింది. రెండు రోజుల్లో 9.4 కోట్ల షేర్ ని వసూలు చేసి లాభాల బాటలోకి వచ్చింది. రెండు రోజుల్లో బడ్జెట్ మొత్తం రావడంతో చిత్ర బృందం ఆనందంలో ఉంది. విదేశాల్లోనూ గీతగోవిందం దూసుకుపోతోంది. వన్ మిలియన్ మార్క్ దాటి పరుగులు తీస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారీగా రెండు రోజుల కలక్షన్స్ (షేర్) వివరాలు…

ఏరియా : కలక్షన్స్
నైజాం : 3.3 కోట్లు
సీడెడ్ : 1.6 కోట్లు ఉత్తరాంధ్ర : 0.98 కోట్లు
గుంటూరు : 0. 90 కోట్లు కృష్ణ : 0. 78 కోట్లు
ఈస్ట్ గోదావరి : 0.81 కోట్లు
వెస్ట్ గోదావరి : 0.68 కోట్లు నెల్లూరు : 0.34 కోట్లు
తెలుగు రాష్ట్రాల్లో : 9.4 కోట్లు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus