గీత గోవిందం మూడు రోజుల కలక్షన్స్

  • August 18, 2018 / 09:54 AM IST

తెలుగు రాష్ట్రాల్లో జోరున వర్షం కురుస్తుంటే.. గీత గోవిందం ప్రదర్శితమయ్యే థియేటర్లలో మాత్రం కలక్షన్ల వర్షం కురుస్తోంది. అర్జున్ రెడ్డి సినిమా తర్వాత విజయ్ దేవరకొండ… పరుశురాం దర్శకత్వంలో చేసిన మూవీ ఆగస్టు 15 న రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. కన్నడ బ్యూటీ రష్మిక విజయ్ కి జోడీగా మంచి మార్కులు అందుకుంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 16 కోట్ల గ్రాస్ ని రాబట్టింది. రెండో రోజుతో కలుపుకుని ఈ సినిమా 25 కోట్లకి పైగా గ్రాస్ వసూలు చేసింది. మూడో రోజు కూడా అదే జోరు కొనసాగించింది. మూడు రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 37.45 కోట్ల గ్రాస్ అందుకొని దూసుకుపోతోంది. వీకెండ్స్ మరింత కలక్షన్స్ రాబట్టే అవకాశముంది. ఏరియాల వారీగా కలక్షన్స్ (షేర్) వివరాలు…

ఏరియా : కలక్షన్స్
నైజాం : 10.40 కోట్లు
సీడెడ్ : 4 .00 కోట్లు ఉత్తరాంధ్ర : 3.12 కోట్లు
గుంటూరు : 1. 90 కోట్లు
కృష్ణ : 2. 10 కోట్లు ఈస్ట్ గోదావరి : 2.08 కోట్లు
వెస్ట్ గోదావరి : 1.90 కోట్లు
నెల్లూరు : 0.90 కోట్లు కర్ణాటక : 2. 50 కోట్లు
తమిళనాడు : 1.79 కోట్లు
ఇతర ప్రాంతాల్లో : 1.11 కోట్లు ఓవర్సీస్ : 5.65 కోట్లు
ప్రపంచవ్యాప్తంగా : 37.45 కోట్లు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus