వంద కోట్ల మైలు రాయిని చేరుకునే దిశలో గీత గోవిందం

  • August 24, 2018 / 07:48 AM IST

నలుగురిలో నారాయణ అనే రీతిలో పెళ్లిచూపులు సినిమా ద్వారా అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ.. రెండో సినిమాకే ఆ నలుగురికి గట్టి పోటీ ఇచ్చాడు. 50 కోట్లను కొల్లగొట్టి పరిశ్రమ చూపుని తనవైపు తిప్పుకున్నారు. ఇప్పుడు పరుశురాం దర్శకత్వంలో చేసిన మూవీ ఆగస్టు 15 న రిలీజ్ అయి భారీ కలక్షన్స్ రాబడుతోంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 16 కోట్ల గ్రాస్ రాబట్టగా మూడు రోజుల్లో 37.45 కోట్ల గ్రాస్ అందుకొని ఔరా అనిపించుకుంది. తొలి వీకెండ్ నాటికీ 50 కోట్ల మెయిలు రాయిని దాటి పరుగులు పెడుతోంది. తాజాగా ఈ సినిమా 75 కోట్ల గ్రాస్ ని వసూలు చేసిందని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

ఒక చిన్న హీరో నటించిన సినిమా లాంగ్ రన్ లో 50 కోట్ల క్లబ్ లో చేరితేనే గొప్ప విజయంగా చెప్పుకుంటాము. అటువంటిది 50 కోట్లను అవలీలగా దాటుకొని 75 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. ప్రపంచవ్యాప్తంగా పది రోజులకే ఈ ఫీట్ సాధించిన మూవీ ఈ వీకెండ్ పూర్తికాకముందే వందకోట్ల క్లబ్ లో చేరిపోవడం గ్యారంటీ అని ట్రేడ్ వర్గాలవారు చెప్పారు. బక్రీద్, శ్రావణ శుక్రవారం.. ఇలా వరుసగా సెలవులు రావడం, పోటీ చిత్రాలు ఏవీ లేకపోవడం గీత గోవిందం వందకోట్ల గ్రాస్ వసూలు చేయడం సులభం అవుతుందని స్పష్టంచేశారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus