బిగ్ బాస్ లో పాల్గొన్నందుకు గీతా మాధురి కి భారీ రెమ్యునరేషన్!

  • June 13, 2018 / 03:59 AM IST

స్టార్ మా ఛానల్ వాళ్ళు బిగ్ బాస్ సీజన్ 2 రియాల్టీ షో ని ఆదివారం గ్రాండ్ గా ప్రారంభించారు. ఇందులో పదమూడు మంది సెలబ్రిటీలతో పాటు ముగ్గురు సామాన్యులకు కూడా అవకాశం కల్పించారు. వందరోజుల పాటు సాగే ఈ షోకి నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్నసంగతి తెలిసిందే. అందుకు గాను నాలుగు కోట్ల రెమ్యునరేషన్ తీసుకోబోతున్నట్లు టీవీ వర్గాల సమాచారం. ఇక ఇందులో పాల్గొన్న వారికీ రెమ్యునరేషన్ ఎలా ఉండబోతోందనేది ఫిలిం నగర్ వాసుల్లో చర్చ జోరుగా సాగుతోంది. షోలో గెలిచిన వారికీ, తర్వాత రెండు స్థానాల్లో నిలిచిన వారికీ  భారీగానే అందుకుంటారు.

ఇక మధ్యలో వెళ్లిపోయిన వారికి వారు హౌస్ లో ఉన్న రోజులు బట్టి పారితోషికం ఉంటుంది. ఇందులో పార్టిసిపెంట్స్ స్థాయి బట్టి కూడా లెక్కలు అంటాయి. అయితే వీటన్నిటికీ భిన్నంగా గీతామాధురి భారీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. తాను ఎన్ని రోజులు ఉన్న దాన్ని బట్టి కాకుండా దాదాపు 20 లక్షలు తప్పకుండా ఇవ్వాలనే రూల్ తో సంతకం చేసినట్లు తెలిసింది. దీని బట్టి చూస్తే గీతామాధురి నెలరోజులకు పైనే తప్పకుండా హౌస్ లో ఉండే అవకాశాలున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus