Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Advertisement

సినిమా ఇండస్ట్రీలో గాయనీగాయకులు ఎక్కువగా తమ పని వరకే పరిమితం అవుతుంటారు. ముఖ్యంగా గీతా మాధురి(Geetha Madhuri) వివాదాలకు చాలా దూరంగా ఉంటారన్న సంగతి తెలిసిందే.

Geetha Madhuri

కానీ, ఎప్పుడూ సైలెంట్‌గా ఉండే ఆమె.. తాజాగా టాలీవుడ్ స్టార్ల గుట్టు రట్టు చేస్తూ ఓ రేంజ్‌లో బాంబ్ పేల్చారు. తానొక్క మాట చెబితే ఇండస్ట్రీలో చాలా మంది బండారం బయటపడుతుందని ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.

సింగర్ నోయెల్ హోస్ట్ చేస్తున్న ఓ యూట్యూబ్ టాక్ షోకి గీతా మాధురి రీసెంట్‌గా అతిథిగా వెళ్లారు. ఈ ఇంటర్వ్యూలో సరదాగా మాట్లాడుతూనే టాలీవుడ్ సెలబ్రిటీల సీక్రెట్స్ బయటపెట్టారు. సాధారణంగా తాను బయట కాఫీ షాపులకు వెళ్లడం చాలా తక్కువ అని.. కానీ, ఎప్పుడైనా అలా వెళ్లినప్పుడు మాత్రం కచ్చితంగా ఎవరో ఒక సెలబ్రిటీ జంట తనకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోతుంటారని ఓ షాకింగ్ విషయాన్ని పంచుకున్నారు.

“నేను వెళ్లిన ప్రతిసారీ ఎవరో ఒకరు నాకు ఇలా అడ్డంగా దొరుకుతూనే ఉంటారు. ఒకవేళ నేను చూసిన ఆ సీక్రెట్స్ గురించి ఇప్పుడు నోరు విప్పితే.. ఇండస్ట్రీలో చాలా మంది కాపురాలు కూలిపోవడం ఖాయం” అంటూ గీతా మాధురి నవ్వుతూనే సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.

ప్రస్తుతం ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఎలాంటి కాంట్రవర్సీలకు పోని గీతా మాధురి, ఇలా సడెన్‌గా టాలీవుడ్ అఫైర్స్ గురించి మాట్లాడటంతో అందరూ అవాక్కవుతున్నారు. ఇంతకీ కాఫీ షాపుల్లో ఆమె కంటపడిన ఆ సీక్రెట్ కపుల్స్ ఎవరు? ఆ ప్రముఖులు ఎవరై ఉంటారా? అని నెటిజన్లు బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. ఏదేమైనా ఆమె కామెంట్స్‌తో అఫైర్స్ నడుపుతున్న ఆ స్టార్స్ మాత్రం టెన్షన్ పడుతున్నారని ఇన్‌సైడ్ టాక్.

‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus