Geetu: నువ్వు ఎలిమినేట్ అయిపోతావేమో..! సెన్సేషనల్ కామెంట్స్ చేసిన గీతు..!

  • October 20, 2022 / 10:47 AM IST

బిగ్ బాస్ హౌస్ లో గీతురాయల్ మితిమీరిన చేష్టలకి హద్దు లేకుండా పోతోంది. ఆదిరెడ్డి గీతక్కా..గీతక్కా అంటూ చనువుగా తిరిగుతుంటే, దాన్ని బాగా అడ్వాంటేజ్ గా తీస్కుంది గీతు. సోఫాలో పడుకుని ఆదిరెడ్డి ముఖం పైకి తన కాలు వచ్చినా కూడా పట్టించుకోకుండా కాలు ఊపుతూ ఆదిరెడ్డితో మాట్లాడింది. అంతకుముందు కూడా ఈవిషయంలో బాలాదిత్య గీతుకి నచ్చజెప్పాడు కూడా. అయినా, ఇప్పుడు ఆదిరెడ్డి ముఖంపై ఇలా కాలు ఊపడం ఎంతవరకూ సంస్కారం అంటూ నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.

బలుపు ఉండచ్చు కానీ, మరీ ఇంత బలుపు ఉండకూడని అంటున్నారు. అంతేకాదు, ప్రతి ఇంట్లో నాలాంటి ఆడపిల్ల ఉండాలని అందరూ అనుకునేలా చేస్తా అని చెప్పిన గీతు ఎలాంటి ఆడపిల్ల ఉండకూడదో చెప్తోందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆదిరెడ్డిని ఈవారం నువ్వు వెళ్లిపోవాలని, ఎందుకంటే, నీ పెర్ఫామన్స్ జీరో ఉందని జోస్యం చెప్పింది గీతు. నువ్వు కాకుండా వేరేవాళ్లు వెళ్లిపోతే నేను ఫీల్ అవుతానని అన్నది. దీంతో ఆదిరెడ్డి నేను గేమ్ బాగానే ఆడాను అని కవర్ చేసుకున్నాడు.

గీతు మాత్రం తన చేష్టలతో హౌస్ మేట్స్ కి తిక్కపుట్టిస్తునే ఉంది. ఇప్పుడు ఏకంగా బిగ్ బాస్ ఆదేశాలని మీరి పనిష్మెంట్ కూడా తీసుకుంది. ఈవిషయంలో గతవారం రాజ్ గీతుని నామినేట్ చేశాడు. అయినా కూడా ఎవ్వరినీ లెక్కచేయని టెంపరితనాన్ని గీతు హౌస్ లో చూపిస్తోంది. బిగ్ బాస్ గేమ్ ఎలా ఆడాలి ? ఎలా ఆడకూడదు అనేది గీతు ఎప్పుడూ సలహాలు చెప్తునే ఉంటుంది. ఇప్పుడు టాలీవుడ్ సెలబ్రిటీ లీగ్ టాస్క్ రద్దు అవ్వడం, ఆ తర్వాత వచ్చిన ఛాలెంజస్ లో హౌస్ మేట్స్ పాల్గొని ఫుడ్ సంపాదించడం జరిగింది.

ఇక్కడే గీతు బిగ్ బాస్ కేవలం గెలిచిన వాళ్లు మాత్రమే ఫుడ్ తినాలని కండీషన్ పెట్టాడు. కానీ, ఓడిపోయిన టీమ్ లో ఉన్న గీతు ఆదిరెడ్డితో కలిసి చపాతీని తిన్నది. దీనికి బిగ్ బాస్ ఆగ్రహించి అంట్లు తోమించాడు. ఇక్కడ కూడా తన జీవితంలో ఎప్పుడూ అంట్లుతోమలేదని బిల్డప్ ఇస్తూ మాట్లాడింది. అంతేకాదు, తను తిన్నతర్వాత చేయి కడక్కోవడానికి కూడా ఇంట్లో వాళ్లు నీళ్లు తెస్తారని బలుపుగా మాట్లాడింది. ఇలా గీతు బిహేవియర్ చూస్తునే బిగ్ బాస్ ఆడియన్స్ ఆమెని ఒక ఆట ఆడుకుంటున్నారు. అదీ మేటర్.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus