Genelia: అర్ధరాత్రి ఒంటి గంటకు జెనీలియాకు మెసేజ్‌ చేసిన రితేశ్‌.. కట్‌ చేస్తే.

  • October 5, 2024 / 11:31 AM IST

అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో భార్యకు భర్త ‘బ్రేకప్‌’ అనే మెసేజ్‌ పంపిస్తే ఎలా ఉంటుంది చెప్పండి.. గుండె ఒక్కసారిగా జారిపోయినట్లు అనిపిస్తుంది. అచ్చంగా ఇలాంటి పరిస్థితేనే ఫేస్‌ చేసింది ప్రముఖ నటి జెనీలియా. ‘బొమ్మరిల్లు’ సినిమాతో తెలుగువారికి దగ్గరైన జెనీలియా ఆ తర్వాత వరుస సినిమాలతో విజయాలు అందుకుని స్టార్‌ అయిపోయింది. అయితే అనూహ్యంగా పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది.

Genelia

బాలీవుడ్‌ నటుడు రితేశ్‌ దేశ్‌ముఖ్‌ను వివాహం చేసుకున్న ఆమె.. వైఫ్‌ లైఫ్‌, మదర్‌ లైఫ్‌ను లీడ్‌ చేసి ఇప్పుడు మళ్లీ ముఖానికి రంగేసుకుంటోంది. వివాహం అనంతరం ఆమె ముంబయిలో సెటిలైన ఆమె.. తన సోషల్‌ మీడియాలో భర్తతో సందడి చేస్తుంటుంది. సరదా వీడియోలు చూస్తూ క్యూట్‌ కపుల్‌గా పేరు తెచ్చుకున్న ఇద్దరూ.. డేటింగ్‌లో ఉన్నప్పుడు ఊహించని చర్యలతో షాక్‌కు గురిచేసేవాడని చెప్పుకొచ్చింది.

డేటింగ్‌లో ఉన్నప్పుడు జరిగిన ఓ సంఘటనను ఎప్పటికీ మరచిపోలేను. నేను త్వరగా నిద్రలోకి జారుకుంటాను. రితేశ్‌కు ఆలస్యంగా నిద్రపోవడం అలవాటు. ఓ అర్ధరాత్రి ఒంటి గంటకు రితేశ్ నాకొక మెసేజ్‌ పంపాడు. ‘‘అంతా అయిపోయింది’’ అంటూ బ్రేకప్‌ మెసేజ్‌ పెట్టాడు. తెల్లవారుజామున ఆ మెసేజ్‌ చూసి నేను షాకయ్యాను. ఆ సమయంలో చాలా బాధగా అనిపించింది కూడా.

ఏం జరిగిందో? రితేశ్‌ అలా ఎందుకు చెప్పాడో అర్థం కాక ఇబ్బందిపడ్డాను. ఉదయాన్నే ఈ విషయాన్ని రితేశ్‌ను అడిగితే.. అసలు ఆ విషయమే గుర్తు లేదనట్లు మాట్లాడాడు. ‘ఏం చేస్తున్నావు.. ఎలా ఉన్నావు’ అని జనరల్‌గా మాట్లాడాడు. దాంతో నాకు కోపం వచ్చేసింది అని జెనీలియా చెప్పుకొచ్చింది ‘ఇకపై మనం మాట్లాడుకోకపోవడం మంచిది. ఏం జరగనట్లు అలా, ఎలా మాట్లాడుతున్నావు?’ అని కేకలు వేశాను అని జెనీలియా నాటి విషయాల్ని గుర్తు చేసుకుంది. అయితే అదంతా తాను జోక్‌గా చేసినట్లు రితేశ్‌ చెప్పడంతో.. జెనీలియా హమ్మయ్య అనుకుందట. ఇదీ జెనీలియా – రితేశ్‌ ‘బ్రేకప్‌’ స్టోరీ.

‘దేవర’ తో తెలుగులో అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ ను సాధించిన 10 సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus