Gentleman : ‘జెంటిల్ మెన్’ లో హీరోగా చెయ్యమని నా చుట్టూ తిరిగారు కానీ.. ఏమైందంటే?

Advertisement

సినీ ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు కేవలం హిట్స్ మాత్రమే కాకుండా, ప్రేక్షకుడు మనసులో నిలిచిపోయే స్థాయిలో ప్రభావం చూపుతాయి. అలాంటి చిత్రాల్లో ఒకటిగా నిలిచింది ‘జెంటిల్ మెన్’. తమిళ్ దర్శకుడు శంకర్ తొలి సినిమాగా తెరకెక్కించిన ఈ చిత్రం అప్పట్లోనే సంచలనం సృష్టించింది. సమాజంలో ఉన్న అసమానతలపై ప్రశ్నిస్తూ పోరాడే ఒక వ్యక్తి కథను ఎంతో గ్రిప్పింగ్‌గా చూపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. హీరోగా అర్జున్ సర్జా తన కెరీర్‌లో ఈ సినిమాతో స్టార్‌గా మరింత బలపడ్డారు.

Gentleman

అయితే ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. మొదట ఈ కథను ప్రముఖ నటుడు హీరో రాజశేఖర్ కు వినిపించి, ఆయనతో ఈ సినిమా చేయాలని దర్శకుడు శంకర్ ఎంతో ఆసక్తి చూపారట. కథ నచ్చి ఆయన చుట్టూ తిరిగిన సందర్భాలు కూడా ఉన్నాయని తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్వయంగా రాజశేఖర్ తన అనుభవలను పంచుకున్నారు. అయితే అదే సమయంలో తాను ‘అల్లరిప్రియుడు’ సినిమాకు డేట్స్ ఇచ్చి ఉండటంతో, ‘జెంటిల్ మెన్’ సినిమాకు డేట్స్ అడ్జస్ట్ చెయ్యలేక, ఆ సినిమాలో నటించే అవకాశం కోల్పోయానని చెప్పుకొచ్చారు.

తరువాత ఈ కథ అర్జున్ సర్జా దగ్గరకు వెళ్ళటం, ఆయన కెరీర్‌లోనే ఒక బిగ్గెస్ట్ హిట్‌గా నిలవటం అందరికి తెలిసిన విషయమే. 1993లో విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించడంతో పాటు, పలు అవార్డులను సొంతం చేసుకుంది. 175 రోజులకు పైగా థియేటర్లలో ప్రదర్శితమై ప్రేక్షకుల మన్ననలు పొందింది.

Mega 158 : చిరంజీవి – బాబీ కాంబోలో విలన్ గా హీరోయిన్ ? ఎవరో తెలుసా ?

https://youtu.be/wnKKqOwIEvw?si=606Fke2k4Wc77ba2

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus