Getup Srinu: బిగ్ బాస్ షోపై షాకింగ్ కామెంట్స్ చేసిన గెటప్ శ్రీను!

  • October 17, 2022 / 05:54 PM IST

బుల్లితెర రియాలిటీ షోలలో ఒకటైన బిగ్ బాస్ షో విషయంలో సెలబ్రిటీలలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది సెలబ్రిటీలు ఈ షోకు వెళ్లడానికి ఆసక్తి చూపిస్తుండగా మరి కొందరు సెలబ్రిటీలు మాత్రం ఈ షో విషయంలో పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ప్రముఖ జబర్దస్త్ కమెడియన్లలో ఒకరైన గెటప్ శ్రీను తాజాగా బిగ్ బాస్ షో గురించి షాకింగ్ కామెంట్స్ చేయగా ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్ షో లో పాల్గొనే ఆఫర్ వచ్చినా నేను వెళ్లలేదని గెటప్ శ్రీను పేర్కొన్నారు.

ప్రస్తుతం సినిమాల షూటింగ్ తో పాటు జబర్దస్త్ షోతో నేను బిజీగా ఉన్నానని ఆ రీజన్ వల్లే బిగ్ బాస్ షోకు వెళ్లడానికి నేను ఆసక్తి చూపించలేదని గెటప్ శ్రీను కామెంట్లు చేశారు. ఆఫర్లు లేకుండా ఖాళీగా ఉంటే బిగ్ బాస్ షోకు వెళ్లేవాడినని గెటప్ శ్రీను వెల్లడించారు. బిగ్ బాస్ షోలో పాల్గొనడం వల్ల మన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు బయటకు వస్తాయని గెటప్ శ్రీను కామెంట్లు చేశారు. బిగ్ బాస్ షోలో పాల్గొనడం ద్వారా మన ఎమోషన్స్ కూడా బయటపడతాయని గెటప్ శ్రీను పేర్కొన్నారు.

మన వ్యక్తిగత విషయాలు ప్రేక్షకులకు తెలియకుండా ఉంటే మాత్రమే స్క్రీన్ పై బాగా యాక్టింగ్ చేయడం సాధ్యమవుతుందని గెటప్ శ్రీను అన్నారు. భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఆఫర్ చేసినా గెటప్ శ్రీను ఆ షోకు వెళ్లకపోవడానికి అసలు కారణం తెలిసి నెటిజన్లు సైతం అవాక్కవుతున్నారు. గెటప్ శ్రీను జబర్దస్త్ షోలోకి రీఎంట్రీ ఇవ్వడంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు.

గెటప్ శ్రీను చిరంజీవి సినిమాలలో ఎక్కువగా కనిపిస్తూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. గెటప్ శ్రీను తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా సక్సెస్ లను సొంతం చేసుకుని క్రేజ్ ను మరింత పెంచుకోవడంతో పాటు మరిన్ని విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus