ఘాజీ ఫస్ట్ డే కలక్షన్స్

  • February 18, 2017 / 08:14 AM IST

దగ్గుబాటి రానా వినూత్న కథతో చేసిన చిత్రం ఘాజీ. 1971 వ సంవత్సరంలో ఇండియ, పాకిస్తాన్ యుద్ధ కథాంశంతో  తెరకెక్కిన ఈ సినిమాలో రానా నేవీ ఆఫీసర్ అర్జున్ గా నటించారు. బాహుబలి  తర్వాత హీరోగా చేసిన ఈ మూవీ ఎన్నో అంచనాలతో శుక్రవారం రిలీజ్ అయింది. సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ ఫిల్మ్ కి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3500 స్క్రీన్ల‌లో ప్రదర్శిత మైన ఘాజీ సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

4.2 కోట్ల కలక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. శనివారం, ఆదివారం ఈ కలక్షన్స్ డబల్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నాయి. ఎక్కువభాగం సముద్రపు అడుగుభాగంలో, సబ్ మెరియన్ లో సాగే ఈ మూవీ ప్రేక్షకులను ఉత్కంఠతకు గురిచేస్తోందని చిత్ర బృందం వెల్లడించింది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus