మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ మూవీ అక్టోబర్ 5న విజయదశమి కానుకగా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లూసిఫర్’ కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. కొణిదెల సురేఖ సమర్పణలో ‘కొణిదెల ప్రొడక్షన్స్’, ‘సూపర్ గుడ్ ఫిలింస్’ బ్యానర్ లపై ఆర్ బి చౌదరి, ఎన్ వి ప్రసాద్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.ఫస్ట్ డే ఈ చిత్రం పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది.
ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో లేకపోయినా పర్వాలేదు అనిపించాయి. మొదటి వారం ఈ మూవీ పర్వాలేదు అనిపించినా.. రెండో వారం మాత్రం పెద్దగా క్యాష్ చేసుకోలేకపోయింది. ఒకసారి 2 వీక్స్ కలెక్షన్స్ ని గమనిస్తే:
నైజాం | 12.13 cr |
సీడెడ్ | 9.45 cr |
ఉత్తరాంధ్ర | 5.79 cr |
ఈస్ట్ | 3.77 cr |
వెస్ట్ | 2.38 cr |
గుంటూరు | 3.99 cr |
కృష్ణా | 2.78 cr |
నెల్లూరు | 2.07 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 42.36 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 4.68 cr |
హిందీ | 5.08 cr |
ఓవర్సీస్ | 5.14 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 57.26 cr (షేర్) |
‘గాడ్ ఫాదర్’ చిత్రానికి అన్ని వెర్షన్లు కలుపుకుని కు రూ.91.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.92 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 2 వారాలు పూర్తయ్యేసరికి ఈ మూవీ రూ.57.26 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి రూ.34.74 కోట్ల షేర్ ను రాబట్టాలి. 2 వ వారం సాలిడ్ గా క్యాష్ చేసుకుంటుంది అనుకుంటే అలా జరగలేదు. కాబట్టి ఇక కష్టమనే చెప్పాలి.
Most Recommended Video
ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!