Good Bad Ugly Collections: రెండో వీకెండ్ ను కూడా క్యాష్ చేసుకునేలా ఉంది..!

Advertisement

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar)  లేటెస్ట్ మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ (Good Bad Ugly) ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షోతోనే ఈ సినిమాకి డీసెంట్ టాక్ రావడం వల్ల ఓపెనింగ్స్ కూడా బాగా వచ్చాయి. ‘మార్క్ ఆంటోనీ’ (Mark Antony) ఫేమ్ ఆధిక్ రవిచంద్రన్ (Adhik Ravichandran) దర్శకత్వం వహించిన ఈ సినిమాని టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ అయిన ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు నిర్మించారు. సినిమాలో అజిత్ ఫ్యాన్స్ కి నచ్చే ఎలిమెంట్స్ ఇందులో ఉంటాయి. సుల్తానా పాటకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

Good Bad Ugly Collections:

సోషల్ మీడియాలో ఈ పాట బాగా వైరల్ అవుతుంది. మొదటి వారం తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా బాగానే కలెక్ట్ చేసింది.8వ రోజు కూడా పర్వాలేదు అనిపించింది. ఒకసారి 8 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 1.51 cr
సీడెడ్ 0.64 cr
ఆంధ్ర 1.09 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 3.24 cr

‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ (Good Bad Ugly) సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో రూ.5 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.5.5 కోట్ల షేర్ ను రాబట్టాలి. 8 రోజుల్లో ఈ సినిమా రూ.3.24 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.5.43 కోట్లు కలెక్ట్ చేసింది. సో బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.2.26 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మరి రెండో వీకెండ్ ఎంత వరకు రాబడుతుందో చూడాలి.

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus