జనవరి 1 న ఫ్యాన్స్ కి కానుక ఇవ్వనున్న మహేష్!

  • December 6, 2017 / 10:55 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో “భరత్ అనే నేను” సినిమా చేస్తున్నారు. ఈ  సినిమా షూటింగ్ వేగంగా సాగుతోంది. కొత్త షెడ్యూల్ నవంబర్ 30వ తేదీ నుండి డిసెంబర్ 7వరకు హైదరాబాద్లో జరుగుతోంది. దీని తర్వాత డిసెంబర్ 10 నుండి 25 వరకు తమిళనాడులోని కారైకుడిలో మరొక షెడ్యూల్ జరగనుంది. దీంతో 90 శాతం టాకీ పార్ట్ పూర్తవుతుంది. మిగిలిన మూడు పాటలు, ఒక ఫైట్ ను జనవరిలో చిత్రీకరించనున్నారు. అయితే మహేష్ తన అభిమానులకు కొత్తసంవత్సర కానుక ఇవ్వనున్నారు. భరత్ అనే నేను సినిమా ఫస్ట్ లుక్ ని డిసెంబర్ 31 సాయంత్రం రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు. ఈ చిత్రానికి సంబంధించి కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి.

కానీ అధికారికంగా పేరు, ఫోటో ఇప్పటివరకు రాలేదు. సో ఆ రోజు టైటిల్ కూడా ఖరారు కానుంది. అంతేకాదు రిలీజ్ డేట్ లో కూడా స్పష్టత వస్తుందని సమాచారం. ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2018 ఏప్రిల్ 17న విడుదల చేయాలనీ అనుకున్నారు. ఆ రోజు అల్లు అర్జున్ నా పేరు సూర్య వస్తున్నప్పటికీ నిర్ణయం మార్చుకోలేదు. తాజాగా రజనీ 2 . 0 అదే రోజు రిలీజ్ కానుండడంతో ఆలోచిస్తున్నారు. రెండు వారాలు  ముందుగానే “భరత్” థియేటర్లోకి వచ్చే అవకాశం ఉందని ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు. వీటిలో ఎంత వరకు వాస్తవం ఉందో జనవరి 1 తెలియనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus