ఏప్రిల్ 14న గోపీచంద్ ‘ఆక్సిజన్’ ఫస్ట్ లుక్

  • April 13, 2016 / 12:35 PM IST

ఎగ్రెసివ్‌ హీరో గోపీచంద్‌ కథానాయకుడిగా ఖుషీ, కర్తవ్యం, పెద్దరికం వంటి చిత్రాలను అందించిన ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం తనయుడు ఎ.ఎం.జోతికృష్ణ దర్శకత్వంలో శ్రీసాయిరాం క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.ఐశ్వర్య నిర్మిస్తున్నచిత్రం ‘ఆక్సిజన్‌’. సినిమా ప్రస్తుతం చిత్రీకరణను జరుపుకుంటుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ఏప్రిల్ 14న విడుదల చేస్తున్నారు. రాశిఖన్నా, అను ఇమ్మాన్యుయల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

గోపీచంద్‌, అనుఇమ్మాన్యువల్, రాశిఖన్నా, జగపతిబాబు, కిక్‌ శ్యామ్‌, రాశిఖన్నా, అను ఇమ్మానుయేల్‌, ఆలీ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: యువన్‌ శంకర్‌రాజా, సినిమాటోగ్రఫీ: వెట్రి, పాటలు: రామజోగయ్యశాస్త్రి, ఫైట్స్‌: సిల్వ, ఆర్ట్‌: మిలన్‌, నిర్మాణ పర్యవేక్షణ: ఎ.ఎం.రత్నం, నిర్మాత: ఎస్‌.ఐశ్వర్య, దర్శకత్వం: ఎ.ఎం.జోతికృష్ణ.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus