గత 5 ఏళ్ళుగా హిట్టు కొట్టడం కోసం ఎంతో కష్టపడుతున్నాడు గోపీచంద్. తన ఆఖరి హిట్టు ‘లౌక్యం’. ఆ తరువాత ‘జిల్’ ‘పంతం’ వంటి యావరేజ్ సినిమాలు ఉన్నాయి కానీ హిట్టయితే లేదు. మంచి యాక్షన్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న గోపీచంద్.. రోటీన్ కథలు, కామెడీ కథలే ఎంచుకుంటున్నాడనే రిమార్క్పడిపోయింది. అందులోనూ కుర్ర హీరోలా పోటీ కూడా ఎక్కువైపోయింది కూడా. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాగైనా హిట్టుకొట్టి బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నాడు. ఇందులో భాగంగా తమిళ దర్శకుడు ‘తిరు’ డైరెక్షన్లో ఓ చిత్రం చేస్తున్నాడు. యాక్షన్ తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందుతుంది.
ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ 50 శాతం పూర్తయిందట. అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘బంగారు బుల్లోడు’ అనే టైటిల్ ను ఖరారు చేసినట్టు తాజా సమాచారం. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని తెలుస్తుంది. తమన్నా, మెహ్రీన్ లను హీరోయిన్లుగా అనుకుంటున్నట్టు తాజా సమాచారం. మరి ఈ చిత్రంతో అయినా గోపీచంద్ హిట్టు కొడతాడేమో చూడాలి..!