టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతున్న సల్మాన్ ఖాన్ గర్ల్ ఫ్రెండ్

  • January 23, 2019 / 12:08 PM IST

సరైన హిట్ లేక ఢీలాపడ్డాడు కానీ.. మంచి సినిమా పడితే స్టార్ హీరోల స్థాయిలో స్టార్ డమ్ సొంతం చేసుకోగల సత్తా ఉన్న కథానాయకుడు గోపీచంద్. క్లాస్ మరియు మాస్ లో సమానమైన క్రేజ్ ఉన్న గోపీచంద్ కు హిట్ దొరికి చాలా ఏళ్లవుతోంది. అయినప్పటికీ మనోడికి ఆఫర్లు ఎప్పుడూ తగ్గలేదు. రీసెంట్ గా తమిళ దర్శకుడు తిరు దర్శకత్వంలో నటించేందుకు సిద్ధమైన గోపీచంద్ ఈ సినిమాలో హీరోయిన్ గా ఇంకా ఎవరూ ఫైనల్ అవ్వలేదు కానీ.. ఓ కీలకమైన పాత్ర కోసం బాలీవుడ్ బొద్దుగుమ్మ జరైన్ ఖాన్ ను సెలక్ట్ చేశారట.

సౌత్ సినిమాలకు ఇంటర్నేషనల్ టచ్ ఇవ్వడంలో తిరు సిద్ధహస్తుడు. అతడి మునుపటి సినిమాలు చూస్తే ఆ విషయం అర్ధమవుతుంది. అందులో భాగంగానే ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ రోల్ కోసం జరైన్ ఖాన్ ను సెలక్ట్ చేసుకొన్నారట. ప్రస్తుతం రాజస్థాన్ లో షూటింగ్ జరుపుకొంటున్న ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ నుంచి జరైన్ సెట్స్ లో జాయిన్ అవుతుంది. బాలీవుడ్ లో చెప్పుకోదగ్గ సినిమాలు లేకపోయినప్పటికీ.. తన అందాల ప్రదర్శనతో ప్రేక్షకుల్ని అలరిస్తున్న జరైన్ టాలీవుడ్ లో తన అందచందాలతో ఎలాంటి హల్ చల్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus