‘సైరా నరసింహా రెడ్డి’ చిత్రానికి అంత అన్యాయం జరిగిందా?

మెగాస్టార్ 151 వ చిత్రంగా తెరకెక్కిన ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా రాంచరణ్ నిర్మించాడు. ప్రేక్షకుల అంచనాల్ని ఏమాత్రం తక్కువ చేయకుండా సురేంద్ర రెడ్డి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసాడనే చెప్పాలి. అయితే పాన్ ఇండియా లెవెల్లో ఈ చిత్రం సక్సెస్ కాలేకపోయిందనే చెప్పాలి. ప్రమోషన్ డోస్ లోపం వల్లే తీవ్ర నష్టాలు వచ్చినట్టు కూడా ట్రేడ్ పండితులు చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా ఈ చిత్రం విషయంలో నిర్మాత రాంచరణ్ కు మరో షాక్ తగిలినట్టు తెలుస్తుంది.

సాధారణంగా స్వతంత్ర సమరయోధుల జీవితాల ఆధారంగా తెరకెక్కే సినిమాలకి పన్ను మినహాయింపుకు ప్రభుత్వాలు ఓకే చేయాల్సి ఉంటుంది. గతంలో బాలకృష్ణ 100 వ చిత్రమైన ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ సినిమాకు పన్ను చంద్రబాబు సపోర్ట్ తో పన్ను మినహాయింపు లభించింది. కానీ మెగాస్టార్ సినిమా ‘సైరా’ కు మాత్రం ప్రభుత్వం ఆ సౌకర్యం కలిగించలేదు. మెగాస్టార్ కు ప్రభుత్వాల నుండీ సరైన సపోర్ట్ లభించట్లేదని ఈ విషయంతో స్పష్టమైంది.

వెంకీ మామ సినిమా రివ్యూ & రేటింగ్!
అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus