Gautham Ghattamaneni: ‘ప్యారడైజ్‌’ సినిమా పరువు తీసేసిన గౌతమ్‌ ఘట్టమనేని.. రేటింగ్‌ ఎంతంటే?

మొన్నామధ్య ‘ప్యారడైజ్‌’ సినిమా మీద వస్తున్న రివ్యూలు, కామెంట్ల గురించి సినిమా టీమ్‌ మాట్లాడుతూ.. ఏవేవో వ్యాఖ్యలు చేసింది. అవేంటి, ఎందుకన్నారు అనేది ఇప్పుడు పక్కన పెడితే.. ఇప్పుడు ఇదే సినిమాపై ప్రముఖ కథానాయకుడు మహేష్‌బాబు తనయుడు గౌతమ్‌ ఘట్టమనేని రాసిన రివ్యూ చూశాక ‘ప్యారడైజ్‌’ టీమ్‌ ఏమంటుందో చూడాలి. సెలబ్రిటీలు ఎక్కువగా సినిమా రివ్యూలు రాసే లెటర్‌ బాక్స్‌డ్‌ అనే వెబ్‌సైట్‌లో గౌతమ్‌ కూడా రివ్యూలు రాస్తుంటాడు. అలా రీసెంట్‌గా ‘ప్యారడైజ్‌’ సినిమా గురించి కూడా రాశాడు అంటూ ఓ స్క్రీన్‌ షాట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Gautham Ghattamaneni

‘ప్యారడైజ్‌’ సినిమాను ఇటీవల వీక్షించిన గౌతమ్ ఘట్టమనేని వన్‌ రేటింగ్‌ ఇచ్చాడు. ఈ సినిమా గురించి చిన్న రివ్యూ కూడా రాశాడు. సినిమాటోగ్రఫీ, ఎమోషనల్ సీన్లలో నటన మినహా మరేమీ తనకు నచ్చలేదని, ఎడిటింగ్ అస్సలు బాలేదని తీవ్ర నిరాశ వ్యక్తం చేశాడు. దీంతో ఇప్పుడు ‘ప్యారడైజ్‌’ సినిమా టీమ్‌ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఎందుకంటే రివ్యూవర్లు సెలబ్రిటీలు అయితే వచ్చే రియాక్షన్‌ ఆసక్తికరంగానే ఉంటుంది కదా.

సినిమాలకు లెటర్‌బాక్స్డ్‌లో రివ్యూలు ఇవ్వడంలో గౌతమ్‌కి కొత్తేమీ కాదు. ప్రపంచ ప్రఖ్యాత సినిమాలెన్నింటికో రివ్యూలు ఇస్తూ ఉన్నాడు. గౌతమ్‌ చూస్తాను అంటూ పెట్టిన సినిమాల జాబితాలో నాగార్జున – నాని ‘దేవ్‌దాస్‌’, కీర్తి సురేశ్‌ ‘డొరోతి’, ‘జైలర్‌ 2’ సినిమాలు ఉన్నాయి. వాటి గురించి ఏం రివ్యూ ఇస్తాడో చూడాలి. ఇవి కాకుండా త్వరలో రిలీజ్‌ అవ్వాల్సిన ప్రభాస్‌ సినిమాలు ‘స్పిరిట్‌’, ‘ఫౌజీ’ లాంటి వాటిని కూడా వాచ్‌ లిస్ట్‌లో యాడ్‌ చేసుకున్నాడు.

కొన్ని రోజుల క్రితం తన లెటర్‌ బాక్స్డ్‌ ప్రొఫైల్ వైరల్ అయిన తర్వాత ఇన్‌స్టాగ్రామ్ బయో నుండి ఆ లింక్‌ను తీసేసిన గౌతమ్, ఈసారి పేజీకి స్వాగతం, ఆ అంచనాలను అందుకోవడానికి ప్రయత్నిస్తాను’ అంటూ క్యాప్షన్ పెట్టి మరీ ఇనస్టాగ్రామ్‌ బయోలో ఆ లింక్ పోస్టు చేశాడు. దీంతో అతని రివ్యూ వైరల్‌గా మారింది.

రెండో ‘మిరాయ్‌’.. కొరియన్‌ పిల్లతోపాటు అమెరికన్‌ తెలుగమ్మాయిని తీసుకున్నారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus