‘శాతకర్ణి’ ఆడియో విడుదల తేదీపై స్పష్టత..!

  • November 23, 2016 / 11:20 AM IST

బాలయ్య ప్రధాన పాత్రలో క్రిష్ తెరకెక్కిస్తున్న ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమా చిత్రీకరణ పూర్తైన సంగతి తెలిసిందే. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటటైన్మెంట్స్ పతాకంపై సాయిబాబు జాగర్లమూడి, వై రాజీవ్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర పనులను జరుపుకుంటోంది. సంక్రాంతి విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా పాటలను వచ్చే నెలలో విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేయగా తాజాగా ఈ వేడుక జరిగే తేదీపై స్పష్టత వచ్చింది.

నందమూరి బాలకృష్ణ వందో చిత్రంగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా పాటలను తొలుత డిసెంబర్ 9న విడుదల చేయాలని భావించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఇప్పుడు అది 16వ తేదీకి మారిందట. తిరుపతి కేంద్రంగా జరుగనున్న ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సహా పలువురు చిత్ర ప్రముఖులు హాజరు కానున్నారు. తెలుగు చక్రవర్తి ‘శాతకర్ణి’ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం సమకూర్చిగా చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు. శ్రేయ, హేమ మాలిని కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకి సాయి మాధవ్ బుర్ర మాటల రచయిత.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus