Gunasekhar, Samantha: ‘యశోద’ హిట్ అయ్యి ఎక్కువ కలెక్ట్ చేస్తే గుణశేఖర్ హ్యాపీ.. ఎందుకంటే..?

  • November 11, 2022 / 09:34 AM IST

సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘య‌శోద‌’ చిత్రం మరికొద్ది గంటల్లో రిలీజ్ కాబోతుంది. స‌మంత చేసిన లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో ఇది కూడా ఒకటి.! ఈ సినిమా పై జనాలు దృష్టి పెట్టడానికి ముఖ్య కారణం.. సమంత పై ఏర్పడ్డ సింపతీ.ఆమె అనారోగ్యం..పాలవ్వడం, పైగా ప్రమోషన్స్ లో కంటతడి పెట్టుకోవడంతో జనాలు ఈ సినిమాని ఆమె కోసం చూడాలని ఫిక్స్ అయ్యారు. అనారోగ్యం పాలైనప్పటికీ సమంత ప్రమోషన్స్ లో పాల్గొనడం.. వంటివి ఆమె పై పాజిటివిటీని పెరిగేలా చేశాయి.ఈ క్రమంలో ‘యశోద’ సినిమా టాక్ ఎలా ఉండబోతుంది… కలెక్షన్స్ ఎలా రాబడుతుంది అనే ఆసక్తి అందరిలోనూ పెరిగింది.

నవంబర్ అనేది సినిమాలకు అన్ సీజన్ లాంటిది అని ట్రేడ్ పండితులు చెబుతుంటారు. ఇలాంటి నేపథ్యంలో ‘యశోద’ కలెక్షన్స్ ఎలా ఉంటాయనే ఆసక్తి కూడా అందరిలోనూ పెరిగింది. ప్రేక్షకులు, నెటిజన్లకు మాత్రమే కాదు దర్శకుడు గుణ శేఖ‌ర్ కు కూడా ‘యశోద’ రిజల్ట్ పై ఆసక్తి పెరిగినట్టు ఇన్సైడ్ టాక్. ఎందుకంటే ఆయన ఈ మధ్య కాలంలో తీసిన ఒక ఒక్క సినిమా ‘శాకుంత‌లం’లో సమంతనే హీరోయిన్. ఎప్పటిలానే గుణశేఖర్ ఈ సినిమాకి అనుకున్నదానికంటే ఎక్కువ బడ్జెట్ పెట్టించాడు.

స‌మంత ఇమేజ్‌ని నమ్ముకొని ‘శాకుంత‌లం’ పై ఎక్కువ బడ్జెట్ పెట్టడం అంటే మామూలు విషయం కాదు. ఈ సినిమాలో ఉన్న ఏకైక స్టార్ స‌మంత మాత్ర‌మే. స‌మంత‌ని చూసి జ‌నాలు థియేట‌ర్ల‌కు వ‌స్తారా, రారా అనేది ‘య‌శోద‌’తో తేలిపోతుంది. ‘శాకుంతలం’ కి రూ.70 కోట్ల‌ వరకు బడ్జెట్ అయ్యింది.

‘య‌శోద‌’ కూడా రూ.40 కోట్ల బడ్జెట్ తో రూపొందిన మూవీ. అయితే ‘యశోద’ సూపర్ హిట్ అయ్యి మంచి కలెక్షన్లు రాబడితే ‘శాకుంతలం’ మూవీ నాన్ థియేట్రికల్ రైట్స్ కు ఎక్కువ రేటు పలుకుతుంది. అది గుణశేఖర్ ఆశ..! మరి అతని ఆశలను ‘యశోద’ నెరవేరుస్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. హరి, హరీష్ లు ‘యశోద’ ని డైరెక్ట్ చేశారు.

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus