టాలీవుడ్ లో చాన్సుల కోసం హన్సిక వెయిటింగ్

  • June 26, 2018 / 12:40 PM IST

చిన్న వయసులోనే పెద్ద హీరోయిన్ అయిపోయిన హన్సిక తెలుగు, తమిళ భాషల్లో ఆల్మోస్ట్ అందరు యువ మరియు పెద్ద హీరోలతో జతకట్టిన హన్సికకు ఈమధ్య ఎందుకో ఆఫర్లు బాగా తగ్గిపోయాయి. ఇటు తెలుగులో, అటు తమిళంలో సరైన అవకాశాల్లేక ఢీలాపడింది. రోజుకో హీరోయిన్ పరిచయమవుతున్న తరుణంలో హన్సిక లాంటి సీనియర్ మోస్ట్ జూనియర్ హీరోయిన్ కి ఆఫర్లు కరువయ్యాయి. దాంతో మొన్నటివరకూ రెగ్యులర్ గా తమిళ చిత్రాలు, అప్పుడప్పుడూ తెలుగు సినిమాలు చేస్తూ కెరీర్ ను నెట్టుకొచ్చిన హన్సిక.. ఇప్పుడు తమిళ సినిమాలు ఆఫర్లు తగ్గడంతో పూర్తి స్థాయిలో తెలుగు సినిమాల మీద కాన్సన్ ట్రేట్ చేస్తోంది.

అందుకే తన ఒన్నాఫ్ ది బెస్ట్ ఫ్రెండ్ అయిన నితిన్ ను సంప్రదించగా.. ఇమ్మీడియట్ గా తన కొత్త సినిమాలో ఆఫర్ ఇప్పించాడట. “ఛలో” ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కనున్న తాజా చిత్రంలో హన్సికను కథానాయికగా ఫైనల్ చేశారు. ఈ ఇద్దరూ ఇదివరకూ “సీతారాముళ కళ్యాణం లంకలో” అనే చిత్రంలో నటించారు. ఆ సినిమా చెప్పుకోదగ్గ స్థాయిలో హిట్ అవ్వలేదు. మరి మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత రిపీటవ్వనున్న ఈ కాంబినేషన్ రిజల్ట్ ఏమవుతుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus