Hansika: సైలెంట్ గా పెళ్లి చేసుకుంటున్న హన్సిక..!

Advertisement

పూరి జగన్నాథ్ టాలీవుడ్ కు పరిచయం చేసిన హీరోయిన్లలో హన్సిక ఒకరు. మొదటి సినిమానే బ్లాక్ బస్టర్ కావడంతో ఈమెకు భారీ క్రేజ్ ఏర్పడింది. ఆ తర్వాత ఎన్టీఆర్ తో ‘కంత్రి’,రామ్ తో ‘మస్కా’, ‘కందిరీగ’, ప్రభాస్ తో ‘బిల్లా’, రవితేజ తో ‘పవర్’ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. కానీ ఇక్కడ స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోయింది. అయితే తమిళ తంబీలు ఈమెను నెత్తిన పెట్టుకున్నారు. అక్కడ ఈమె స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

మొత్తంగా ఈమె కెరీర్లో 50 సినిమాలు కంప్లీట్ చేసి ఖాళీగా ఉంది. వయసు కూడా 30 దాటింది. ఇక పెళ్లి చేసుకోవడమే ఆలస్యం అని అంతా అనుకుంటున్నారు. గతంలో ఈమె శింబుతో ప్రేమాయణం నడిపింది. కానీ అది ఎక్కువ కాలం సాగలేదు. తర్వాత కొంతమంది యంగ్ హీరోలతో ప్రేమాయణం నడిపినట్టు వదంతులు వినిపించాయి. హీరోయిన్ల ప్రేమ వ్యవహారాలపై అంత ఈజీగా క్లారిటీ రాదన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. సైలెంట్ గా హన్సిక పెళ్లి చేసుకోబోతుంది అనే విషయం చర్చనీయాంశం అయ్యింది.

అంతేకాదు పెళ్లి జరిగే ప్లేస్ కూడా ఫిక్స్ అయిపోయిందట. అందుతున్న సమాచారం ప్రకారం…హన్సిక డిసెంబర్ లో పెళ్లికి సిద్ధమైపోయిందట.జైపూర్ లో ఉన్న ముండోట ప్యాలెస్ వేదికగా హన్సిక పెళ్లి జరుగుతుందని సమాచారం. 450 ఏళ్ళ క్రితం నాటి ఈ పురాతన ప్యాలస్ లో ఉన్న అన్ని గదులను ముందుగానే బుక్ చేసేశారని తెలుస్తుంది. పెళ్లి వేదిక, అతిథులకు విడిది అన్నీ ఇక్కడేనట.

‘అసలు లేనిదే పెసరపప్పు’ అన్నట్టు.. పెళ్లి కొడుకు ఎవరో చెప్పకుండా ఈ హన్సిక పెళ్లి గోల ఏంటి అనే డౌట్ మీకు రావచ్చు. మీకే కాదు ఎవరికైనా రావచ్చు.అయితే ఈ సస్పెన్స్ కొన్నాళ్ళు తప్పదు. అయితే ప్రేమించిన అబ్బాయినే హన్సిక పెళ్లి చేసుకోబోతుందని సమాచారం. అతనొక బిజినెస్ మెన్ అని పొలిటీషియన్ కొడుకు అని టాక్. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news