మరీ చిన్నప్పుడే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేయడం వలనో లేక సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా అందరు హీరోలతో యాక్ట్ చేసేయడం వలనో తెలియదు కానీ… చిన్న వయసులోనే సీనియర్ హీరోయిన్ ముద్రపడిపోయింది హన్సిక మీద. ప్రస్తుతం ఆమె వయసు కేవలం 27 ఏళ్ళే అయినప్పటికీ.. ఆమె కంటే వయసులో పెద్ద హీరోయిన్లకు కూడా ఆమె సీనియర్ లా ఉంటుంది.
ఇదివరకు కూడా హన్సిక కొందరు హీరోయిన్స్ తో రిలేషన్ లో ఉన్నప్పటికీ.. ఆమె కొన్నాళ్ళ క్రితం శింబుతో లివ్ ఇన్ లో ఉండడం మాత్రం చర్చనీయాంశం అయ్యింది. తర్వాత వాళ్ళు కారణాంతరాల వల్ల విడిపోయారనుకోండి. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత ఆమె పబ్లిక్ గా “అవును నేను శింబుతో రిలేషన్ షిప్ లో ఉన్నాను” అని ఎనౌన్స్ చేయడం పెద్ద ఇష్యూ అయ్యింది. హన్సిక కంటే శింబు పదేళ్ళు పెద్దోడు.. అంతేగాక ఇదివరకు శింబు నడిపిన ప్రేమవ్యావహారాలు, ఎఫైర్లు చూసుకుంటే హన్సిక కంగారు పడిందేమోనని ఆమె అభిమానులు ఫీలైపోతున్నారు. మరి హన్సిక త్వరగా రియలైజ్ అవుతుందా లేదా అనేది చూడాలి.