నేను కూడా తక్కువ కాదంటున్న హన్సిక..!

  • November 16, 2019 / 01:19 PM IST

హన్సిక చాలా రోజుల తరువాత తెలుగులో ‘తెనాలి రామకృష్ణ బి ఏ బి ఎల్’ సినిమా చేసింది. నవంబర్ 15న(ఈరోజు) ఈ చిత్రం విడుదల కాబోతుంది. సందీప్ కిషన్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని కామెడీ చిత్రాల దర్శకుడు జి.నాగేశ్వర్ రెడ్డి డైరెక్ట్ చేసాడు. ఇక ఈ చిత్రం ప్రమోషన్లలో భాగంగా హన్సిక కొన్ని ఆసక్తికరమైన సంగతుల్ని చెప్పుకొచ్చింది. విషయం ఏమిటంటే… హన్సిక కూడా ఓ అడల్ట్ కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్ లో నటిస్తుందట. మరో నాలుగు రోజుల్లో చిత్రీకరణ మొత్తం పూర్తవుతుందని ఆమె చెప్పుకొచ్చింది.

ఈ వెబ్ సిరీస్ ను అశోక్ డైరెక్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. గతంలో ఈ దర్శకుడు ‘పిల్ల జమిందార్’ ‘సుకుమారుడు’ ‘భాగమతి’ వంటి చిత్రాలను డైరెక్ట్ చేసాడు. మహేష్ సోదరి మంజుల ఈ వెబ్ సిరీస్ ను నిర్మించబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే వెబ్ సిరీస్ ల హవా తెలుగులో ఎక్కువైందన్న సంగతి తెలిసిందే. సమంత కూడా ఓ వెబ్ సిరీస్ లో నటిస్తుంది. ఇప్పుడు హన్సిక కూడా వెబ్ సిరీస్ ల వైపు రావడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. ఈ వెబ్ సిరీస్ లో లిప్ లాక్ లు, గ్లామర్ షో తో రెచ్చిపోయిందని తెలుస్తుంది.

తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్ సినిమా రివ్యూ & రేటింగ్!
యాక్షన్ సినిమా రివ్యూ & రేటింగ్!
తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus