నయన, విగ్నేష్ జంటను ప్రశ్నిస్తున్న నెటిజనులు

మలయాళ బ్యూటీ నయనతార వరుసగా విజయాలు అందుకొని దక్షిణాది టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. స్టార్ హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ అందుకుంటోంది. నయన డేట్స్ కోసం దర్శకనిర్మాతలు క్యూలో ఉంటే ఆమె మాత్రం తన ప్రియుడు, యువ డైరక్టర్ విగ్నేష్ తో కలిసి ప్రేమ యాత్రలు చేస్తోంది. నయ‌న‌తార బ‌ర్త్‌డేని సెల‌బ్రేట్ చేసుకునేందుకు ఇటీవల వీరిద్ద‌రూ న్యూయార్క్ వెళ్లి ఎంజాయ్ చేశారు. తాజాగా విగ్నేష్ బ‌ర్త్‌డే కోసం అమృత్‌స‌ర్ వెళ్లారు. అక్క‌డ గోల్డెన్ టెంపుల్‌ని ద‌ర్శించుకొన్నారు. అలాగే అందమైన ప్రాంతాల్లో విహరిస్తున్నారు. అలా వారు విహరిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

వాటిని చూసిన అభిమానులు.. ప్రేమ యాత్రలు బాగానే ఉన్నాయి.. పెళ్లి ఎప్పుడని ? ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్నకి మాత్రం ఇప్పుడే సమాధానం చెప్పేలా లేదు. ఎందుకంటే ఆమె ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి లో ప్రధాన హీరోయిన్ గా నటిస్తోంది. లవ్ యాక్షన్ డ్రామా అనే మలయాళ సినిమా చేస్తోంది. మరో రెండు తమిళ సినిమాల్లో లీడ్ రోల్ పోషిస్తోంది. ఇవన్నీ కంప్లీట్ కావాలంటే రెండేళ్లు పట్టేలా ఉంది. ఆ సినిమాల తర్వాతే నయనతార పెళ్లి చేసుకోవచ్చని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus