గబ్బర్ సింగ్ సినిమా సూపర్ హిట్ అనే టాక్ తెచ్చుకోవడంతో అసలు నన్ను మించిన దర్శకుడు లేదు అని ఫీల్ అయ్యాడు మన హరీష్ శంకర్. అయితే స్వతహాగానే టాలెంట్ ఉన్న వాళ్ళకు అవకాశం ఇచ్చే ఎన్టీఆర్ ని ఒడిసి పెట్టి, రామయ్యా వస్తావయ్యా సినిమా తీసేసాడు…కట్ చేసి చూస్తే ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యీ ఎన్టీఆర్ కరియర్ లో ఒక మచ్చగా మిగిలిపోయింది. అయితే రవితేజతో మంచి హిట్ ను అందుకున్న హరీష్, ఆ తరువాత చిన్న చితకా సినిమాలతో టైమ్ పాస్ చేసేసాడు. ఇదిలా ఉంటే తాజాగా బన్నీతో చేసిన డీజె మిస్ ఫైర్ కావడంతో ఒక్కసారిగా షాక్ కి గురై తన నెక్స్ట్ సినిమా ఏం చెయ్యాలో తెలియాయని సందిగ్ధంలో పడ్డాడు. ఇదిలా ఉంటే తన నెక్స్ట్ సినిమాపై మీడియా వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలకు మన వాడు ఏం సమాధానం ఇస్తున్నాడు అంటే…ప్రస్తుతానికి తాను ఇంకా ఏ సినిమాకి కమిట్‌మెంట్ ఇవ్వలేదు అని, ఇంకా ఏ హీరోతో కానీ… ఏ నిర్మాతతో కానీ సంప్రదింపులు అయితే జరపలేదంటున్నాడు.
అయితే ప్రస్తుతం తన గత సినిమాలతో పోలిస్తే పూర్తి భిన్నమైన సినిమా చేయాలని అనుకుంటున్నాడట. ఈసారి చేయబోయేది రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదని…అదొక కాన్సెప్ట్ బేస్డ్ ఫిలిం అని చెప్పాడు హరీష్. ఆల్రెడీ తాను ఒక ఐడియా అనుకున్నానని… దాన్ని డెవలప్ చేయాల్సి ఉందని… స్క్రిప్టు పనులకు సమయం పడుతుందని అతను తెలిపాడు ఈ ఫ్లాప్ దర్శకుడు. మొత్తంగా పాపం డీజె మిగిల్చిన కష్టాలు మన దర్శకుడికి మెల్కొలుపును తెచ్చిపెట్టింది. చూద్దాం మరి ఏం జరుగుతుందో.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.