హెబాకు శాపంగా మారిన స్పైసీ సాంగ్!

ఎక్స్ పోజింగ్ కు వల్గారిటీకి మధ్య తేడా చాలా చిన్నది. ఆ తేడా గమనించగలిగిన కథానాయిక మాత్రమే తన అందాల ప్రదర్శనను అదుపులో ఉంచుకొని కెరీర్ ను కొనసాగించగలదు. అయితే.. ఇటీవల విడుదలైన “ఈడోరకం ఆడోరకం” సినిమాలోని బీచ్ సాంగ్ లో “కుమారి 21 ఎఫ్” ఫేం హేబ్బా పటేల్ అందాల ప్రదర్శన శృతిమించిందని అందరూ చెప్పుకొంటున్నారు.

యద సంపదను బలవంతంగా బహిర్గిత పరచడంతోపాటు.. చాలా చోట్ల యద లోతులను కూడా ఏమాత్రం మొహమాటపడకుండా చూపెట్టడంతో.. ఈ విధంగా దిగజారిన హేబ్బాకు హీరోయిన్ గా అగ్రస్థానానికి చేరుకొనే అవకాశం చేజేతులారా జారవిడుచుకొందని కొందరు విశ్లేషిస్తున్నారు. బీచ్ సాంగ్ లో మాత్రమే కాకుండా “కో కో కోడి” పాటలోనూ సొనారికాతో పోటీ పడి మరీ అందాలను ఉదారంగా ఆరబోసింది. తెలిసి చేసిందో.. తెలియక చేసిందో తెలియదు కానీ.. ఈ రెండుపాటల్లో ఆమె అందాలను చూస్తున్న ప్రేక్షకులు పండగ చేసుకొంటుండగా.. ఆమెను తమ సినిమాల్లో కథానాయికగా ఎంపిక చేసుకొందామని భావిస్తున్న దర్శకనిర్మాతలు మాత్రం వెనకడుగు వేస్తున్నారు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus