తప్పటడుగులు వేస్తున్న ‘కుమారి 21’!!!

  • March 12, 2016 / 09:59 AM IST

‘అలా..ఇలా’ సినిమాతో సినీ అరంగేట్రం చేసిన అందాల భామ హెభా పటేల్ కు ఆ సినిమా పెద్దగా కలసి రాలేదు. అయితే అసలు ఆమె ఆ సినిమాలో నటించినట్లే ఎంతో మందికి తెలీదు. అదే క్రమంలో ఈ సినిమా అంటూ ఒకటి ఉంది అని చాలా మందికి తెలీదు కూడా. సరే ఆ కధ అంతా పక్కన పెడితే…కుమార్ 21F సినిమాలో తనదైన శైలి నటించిన హెభా పటేల్ కు ఆ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టడంతో వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది.

ఇదే క్రమంలో ఈ భామ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇంతకీ ఆ సంచలన నిర్ణయం ఏంటి అంటే….ఈ భామ ఒక టాప్ హీరో సినిమాలో ఐటమ్ సాంగ్ చేసేందుకు రెడీ ఆవుతుంది అంట. ఇప్పటికే దానికి సంబంధించిన చర్చలు కూడా జరిగాయట. అయితే ఓ సినిమాలో నటించినా రాని క్రేజ్ స్టార్ హీరోల సినిమాల్లో ఐటం సాంగ్ చేస్తే వస్తుంది అన్న హెభా పటేల్ ఆలోచన బాగానే ఉన్నా కెరియర్ స్టార్టింగ్ లోనే అలా చేయడం ఎంతవరకు మంచిదో ఆలోచించాలి అంటున్నారు. అంతేకాకుండా చేతిలో సినిమాలు ఏమీ లేకపోతే పర్వాలేదు ఆని, వరుసగా నాలుగు సినిమాలు చేతిలో ఉంచుకుని కూడా ఆమె ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక ఆమె ఆలోచన ఏంటో ఎవ్వరికీ అర్ధం కావడంలేదు.

మరో పక్క ఆమె సన్నిహితులంతా ఆమె తప్పటడుగులు వేస్తుంది అని తనకు అర్ధం అయ్యేలా చెబుతున్నారంట. అయినా ఒకటి రెండు సినిమాల్లో ఐటమ్  సాంగ్ లో నటిస్తే కదా తెలిసేది అది ‘రాంగ్ స్టెప్’ అవునా….కాదా అని తెలిసేది. చూద్దాం ఏం జరుగుతుందో.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus