“24 కిస్సెస్” ట్రైలర్ లో రెచ్చిపోయిన హెబ్బా

  • October 25, 2018 / 07:23 AM IST

ముంబై బ్యూటీ హెబ్బా పటేల్ “అలా..ఎలా” సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చినప్పటికీ కుమారి 21 ఎఫ్ మూవీతో యువతలో భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంది. రాజ్ తరుణ్ హీరోగా నటించిన ఆ చిత్రంలో కుమారిగా బోల్డ్ గా నటించి, మెప్పించింది. చిన్న సినిమా అయినప్పటికీ పెద్ద సక్సస్ సాధించడానికి కారణం హెబ్బా పటేల్ నటనే అని సినీ విశ్లేషకులు సైతం చెప్పారు. ఆ తర్వాత ఎన్ని సినిమాలు చేసినా.. ఎక్కడికి పోతావు చిన్నవాడు మినహా ఏదీ హిట్ కాలేదు. తాజాగా మరో హిట్ అందుకోబోతుందని ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు. అదే ” 24 కిస్సెస్”. యువదర్శకుడు అయోధ్య కుమార్ తెరకెక్కించిన ఈ మూవీలో హెబ్బా బోల్డ్ గా నటించిందని తెలుస్తోంది.

రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ ప్రకారం.. హీరో అదిత్ అరుణ్ హేబ్బా తో రిలేషన్ స్టార్ట్ చేస్తాడు.. కానీ అది ప్రేమో కాదో తెలియని కన్ఫ్యూషన్ లో ఉంటాడు. ఇక టైటిల్ కి తగ్గట్టే హాటు హాటు కిస్సులున్నాయి. 1..2..3..4 అంటూ 24 కౌంటు అనే కిస్సుల సెలబ్రేషన్ పాట కూడా ఉంది. అందులో హీరో హీరోయిన్లు రెచ్చిపోయి ముద్దులు పెట్టుకుంటున్నారు. ఆ ముద్దులను వెండితెరపై చూడాలని యువకులు ఆతృతగా ఉన్నారు. ఇంతగా ఆసక్తి రేపిన ఈ మూవీ వచ్చేనెల 15 న రిలీజ్ కానుంది. తప్పకుండా ఈ మూవీ కుమారి 21 ఎఫ్ రేంజ్ లో హిట్ అవుతుందని భావిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus