అక్కా.. అక్కా అంటూనే : హేమ కామెంట్స్

  • July 30, 2019 / 01:45 PM IST

నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్ సీజన్ 3’ కి రోజు రోజుకి ఆదరణ పెరుగుతూ వస్తుంది. మొదటి వారం సినీ నటి హేమ ఎలిమినేటయిన సంగతి తెలిసిందే. హౌస్ నుండీ బయటకి వచ్చిన తరువాత నాగార్జున అడిగిన ప్రశ్నలకు చక్కగా సమాధానాలు చెప్పింది హేమ. ‘హౌస్ లో అంతా బాగానే ఉందని’ చెప్పింది. కానీ బయటకి వచ్చాక వేరే మాటలు చెబుతుంది. ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియా లో చర్చనీయాంశం అవుతున్నాయి. ‘కావాలనే తనని హౌస్ నుండీ బయటకి పంపించేశారు’ అంటూ మండిపడుతుంది.

హేమ మాట్లాడుతూ.. ” ‘బిగ్ బాస్ 3’ నుండీ నన్ను కావాలనే బయటకి పంపించేశారు. లోపల ఒకటి జరిగితే బయట ఇంకొకటి ప్రసారం చేశారు. ఈ షోలో ఉన్నది ఉన్నట్లుగా చూపించడం లేదు. ప్లాన్ వేసి నన్ను బయటకి పంపేశారు. అక్కా.. అక్కా అంటూనే నాపై లేని పోని మాటలు చెప్పారు. హౌస్ లో గొడవ జరిగిన విధానానికి షోలో చూపించిన విధానానికి అసలు పొంతనే లేదు” అంటూ చెప్పుకొచ్చింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus