‘క్రికెట్ గర్ల్స్ అండ్ బీర్’ ‘చందమామ కథలు’ వంటి సినిమాలతో నటుడిగా పరిచయమైన నాగ శౌర్య ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ సినిమాలో అమాయకంగా కనిపిస్తూనే కామెడీ చేస్తూ అలరించి యూత్ కు చాలా దగ్గరయ్యాడు నాగ శౌర్య. అటు తర్వాత ‘దిక్కులు చూడకు రామయ్య’ ‘ఛలో’ ‘అశ్వద్ధామ’ ‘వరుడు కావలెను’ వంటి సినిమాలతో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక నవంబర్ 19న అనూష శెట్టి అనే అమ్మాయిని వివాహం చేసుకుని ఫ్యామిలీ లైఫ్లోకి ఎంట్రీ ఇచ్చాడు నాగ శౌర్య.
వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. ఇక ఈరోజు నాగ శౌర్య భార్య అనూష శెట్టి పుట్టినరోజు కావడంతో ‘లైఫ్ మనకు ఎలాంటి సిట్యుయేషన్ ఇచ్చినా వాటిని నీతో కలిసి అధిగమిస్తాను అని నాకు తెలుసు.. హ్యాపీ బర్త్ డే మై వరల్డ్’ అంటూ తన భార్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాడు ఈ యంగ్ హీరో.
ఇతని పోస్ట్ వైరల్ అవ్వడంతో నెటిజన్లు కూడా వీరికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ కామెంట్లు పెడుతున్నారు. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :