స్వల్ప గాయాలతో బయటపడ్డ నాని!

  • January 26, 2018 / 03:35 PM IST

వరుస విజయాలతో వాయువేగంతో దూసుకుపోతున్న నాని అదృష్టరేఖను చూసి ఆ దురదృష్టానికి కన్ను కుట్టిందో ఏమిటో కానీ.. పాపం నానికి ఉదయం హైద్రాబాద్ వస్తుండగా చిన్న యాక్సిడెంట్ అయ్యింది. హైద్రాబాద్ శివార్లలో డ్రైవర్ కారు నడుపుతుండగా.. మధ్యలో డ్రైవర్ నిద్రలేమితో కారు నడుపుతుండగా ఆమరపాటులో ఒక కరెంట్ స్తంభాన్ని గుద్దాడు. నగర శివారు కావడం, వెంటనే డ్రైవర్ కోలుకొని నానిని హాస్పిటల్ కి తీసుకెళ్లడంతో ఈ యాక్సిడెంట్ వార్త ఎవరికీ ఉదయం ఎవరికీ తెలియలేదు.

అయితే.. లక్కీగా నానికి చిన్న చిన్న దెబ్బలు మినహా పెద్ద గాయాలేమీ అవ్వలేదు. యాక్సిడెంట్ విషయం సాయంత్రానికి బయటకి పొక్కి రకరకాల కథనాలు వెలువడుతుండడంతో నాని వెంటనే స్పందించి తన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా “నేను సేఫ్ గానే ఉన్నాను” అని ప్రకటించాడు. దాంతో నాని అభిమానులు స్థిమితపడ్డారు. అదే సందర్భంలో నాని కొన్ని రోజులు విరామం తీసుకొంటున్నాను అని కూడా పేర్కొన్నాడు. సో యాక్సిడెంట్ అయ్యిందన్న బాధ కంటే కొడుకుతో కులాసాగా గడపడానికి ఒక వారం దొరికిందన్న ఆనందమే నాని ట్వీట్ లో కనపడింది.

సో, డియర్ నేచురల్ స్టార్ ఫ్యాన్స్ నానికి తగిలినవి చాలా చిన్న గాయాలు.. సో యూట్యూబ్ లో మరో 24 గంటల్లో ప్రత్యక్షమయ్యే “నాని కారుకి ఏమయ్యిందో తెలుసా?, నాని డ్రైవర్ ఏం చేశాడో తెలుసా?, నానికి యాక్సిడెంట్ అందుకే అయ్యింది?” లాంటి చెత్త హెడ్డింగులున్న వార్తలు చూసి కంగారుపడకుండా ఈ లాంగ్ వీకెండ్ ని హ్యాపీగా ఎంజాయ్ చేయండి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus