Hero Nani: ప్రభాస్‌ బాటలో నడుస్తున్న నాని…!

సినిమాల్లో నానికి అచ్చిరానివి ఏవి అంటే… ఓ రెండు విషయాలు కనిపిస్తాయి. అందులో ఒకటి యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌, రెండోది యాస. కావాలంటే ఒకసారి రివైండ్‌ ఏసుకోండి మీకే తెలుస్తుంది. అయితే ఈ విషయాన్ని పక్కనపెట్టి నాని మరోసారి రిస్క్‌ చేయబోతున్నాడని తెలుస్తోంది. అయితే తొలి విషయం పక్కనపెట్టి… రెండో విషయమైన యాసను తీసుకుంటున్నాడట. అవును నాని మరోసారి యాస మారుస్తున్నాడట. తన 29వ సినిమా అప్‌డేట్‌ను దసరా సందర్భంగా విడుదల చేస్తామని ఇటీవల నాని అధికారికంగా సోషల్‌ మీడియాలో ప్రకటించాడు.

ఆ సినిమా గురించి ఇప్పటివరకు వచ్చిన లీకుల ప్రకారం చూస్తే… ఆ సినిమా తెలంగాణ నేపథ్యంలో ఉంటుంది. ఇందులో నాని తెలంగాణ కుర్రాడిగా… అదే యాసలో మాట్లాడతాడు అని చెప్పారు. అయితే తాజాగా దీనిపై చిన్నసైజ్‌ క్లారిటీ వచ్చింది. అవే నిజమైతే… నాని ఈ సినిమా సింగరేణి బిడ్డగా కనిపిస్తాడట. ప్రస్తుతం టాలీవుడ్‌లో సింగరేణి బిడ్డగా కనిపించబోతున్న హీరో ప్రభాస్‌. ‘సలార్‌’ సినిమాలో ప్రభాస్‌ సింగరేణి అబ్బాయిగా కనిపిస్తాడని టాక్‌.

ఇప్పుడు అదే బాటలో నడుస్తూ నాని కూడా సింగరేణి ముద్దు బిడ్డ అవబోతున్నాడు. పనిలోపనిగా తెలంగాణ డైలక్ట్‌లో మాట్లాడతాడట. ఇప్పటికే ‘జెండాపై కపిరాజు’, ‘కృష్ణార్జున యుద్ధం’లో యాస మార్చి ఫ్లాప్‌ తెచ్చుకున్న నాని… ఈ సారి ఏం చేస్తాడో చూడాలి.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Share.