అనారోగ్యం పాలైన నటుడు రాజశేఖర్?

  • June 26, 2019 / 05:40 PM IST

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ మరో రెండు రోజుల్లో ‘కల్కి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఆయన అస్వస్థతకి గురైనట్లు తాజా సమాచారం. దీంతో ‘కల్కి’ చిత్రం ప్రమోషన్లలో భాగంగా ఈరోజు ఆయన పాల్గొనాల్సిన కొన్ని ఇంటర్వ్యూలను క్యాన్సిల్ చేశారట. అంతేకాదు ఈరోజు సాయంత్రం జరగాల్సిన ‘కల్కి’ ప్రీరిలీజ్ వేడుకని కూడా క్యాన్సిల్ చేసినట్టు కూడా ప్రచారం జరుగుతుంది. సినిమా విడుదల విషయంలో ఒత్తిడి పెరగడంతో నిన్నటి నుండి జ్వరంతో బాధ పడుతున్నారట.

ఈరోజు కాస్త కోలుకున్నట్లు తెలుస్తుంది. జ్వరం తగ్గితే రేపు జరగాల్సిన ‘కల్కి’ ప్రమోషన్స్ లో పాల్గొంటారని సమాచారం. లేదంటే వాటిని కూడా క్యాన్సిల్ చేసే అవకాశం ఉందట. పదేళ్ళ తరువాత ‘గరుడ వేగ’ చిత్రంతో సక్సెస్ అందుకున్న రాజశేఖర్ నటిస్తున్న సినిమా కావడంతో ‘కల్కి’ పై మంచి అంచనాలు ఉన్నాయి. టీజర్, ట్రైలర్ లు కూడా ఆసక్తికరంగా ఉండడంతో సినిమా కచ్చితంగా హిట్టవుతుందని ప్రేక్షకులు ఆశిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus