యాంగ్రీ యంగ్ మ్యాన్ గా పేరుతెచ్చుకున్న హీరో రాజశేఖర్ హిట్స్ లేక కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు. దాదాపు మూడేళ్ళ గ్యాప్ తర్వాత ‘గరుడ వేగ’ సినిమాను చేస్తున్నారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ద్వారా రాజశేఖర్ పూర్వవైభవాన్ని సొంతం చేసుకోవడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఏడాది పాటు కష్టపడి సినిమాని పూర్తి చేశారు. ప్రచారాన్ని కూడా గట్టిగానే చేస్తున్నారు. నలుగురు సెలబ్రిటీలతో గ్రాండ్ గా రిలీజ్ చేయించనున్నారు. రానా దగ్గుబాటి, కాజల్ అగర్వాల్, తాప్సి పన్ను, మంచు లక్ష్మిలు ఈరోజు (శుక్రవారం) సాయంత్రం 5 గంటలకు ఒకేసారి తమ ట్విట్టర్.. ఫేస్ బుక్ అకౌంట్ల ద్వారా టీజర్ లాంచ్ చేయనున్నారు.
మరి ముగ్గురూ మూడు రకాల టీజర్లు రిలీజ్ చేస్తారా..? లేక ఒకే టీజర్ ను నలుగురు లాంచ్ చేస్తారా? అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. ఇందులో నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అధికారిగా రాజశేఖర్ కనిపించనుండగా, అతని పక్కన జోడీగా ‘విశ్వరూపం’ భామ పూజా కుమార్ నటిస్తోంది. తమిళ నటుడు కిషోర్ విలన్ పాత్రలో అదరగొట్టనున్నారు. 25 కోట్లతో కోటేశ్వరరాజు నిర్మిస్తున్న ఈ చిత్రంపై రాజశేఖర్ ఆశలు పెట్టుకున్నారు.