Rajashekhar: సినిమాలోకి వెళ్తానంటే హీరో రాజశేఖర్ ఇంట్లో ఏమన్నారో తెలుసా?

Advertisement

తెలుగు చిత్ర పరిశ్రమలో యాంగ్రీ యంగ్ మాన్ గా, యాంగ్రీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు సీనియర్ నటుడు రాజశేఖర్. ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్‌లో విలక్షణమైన పాత్రలతో అలరిస్తున్నారు. ఇటీవల ‘ బైకర్’ లాంటి సినిమాల్లో తన నటనతో మెప్పించిన ఆయన, సినిమా రంగంలోకి రావడానికి పడ్డ సంఘర్షణ ఆసక్తికరంగా ఉంటుంది.

Rajashekhar

రాజశేఖర్ కేవలం నటుడే కాదు, వృత్తిరీత్యా వైద్యుడు. డాక్టర్‌గా ప్రాక్టీస్ మొదలుపెట్టిన సమయంలో, తాను నటుడిని అవుతానని తండ్రికి చెప్పారు. దానికి ఆయన తండ్రి తీవ్రంగా మందలించారు. “చదువు పూర్తి చేసి, గౌరవప్రదమైన డాక్టర్ వృత్తిని వదిలి సినిమాల్లోకి వెళ్తావా?” అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సినిమాల్లోకి వెళ్లాలంటే ఇల్లు వదిలి వెళ్ళిపోమని చెప్పారు. మొండితనం, పట్టుదల బాగా ఉన్న రాజశేఖర్ తన ఆశయాన్ని వదులుకోలేక ఇల్లు వదిలి బయటకు వచ్చి ఒక హాస్టల్‌లో చేరారు. అది వారికి తెలిసిన వారి హాస్టల్.

అయితే తాను నిజంగానే హాస్పిటల్‌కు వెళ్లడం లేదనే విషయం తండ్రికి తెలియాలని రెండు రోజుల పాటు ఎవరికీ చెప్పకుండా గడిపారు. రాజశేఖర్ పట్టుదలను గమనించిన తండ్రి, మూడో రోజు స్వయంగా ఆసుపత్రి దగ్గరకు వచ్చి తన కుమారుడితో మాట్లాడారు. “నువ్వు సినిమాల్లోకి వెళ్తాను అంటే వెళ్ళు.. కానీ అక్కడ రాణించి నీ సత్తా చాటు. ఈ పని వదిలేసి మళ్లీ వెనక్కి వచ్చే పరిస్థితి తెచ్చుకోవద్దు” అని తన తండ్రి దీవించారట.

సినీ ప్రయాణంలో రాజశేఖర్ అనేక విమర్శలను ఎదుర్కొన్నారు. ఆయన డాన్స్ స్టైల్ లేదా ముఖ కవళికల మీద ట్రోల్స్ వచ్చినా, ఆయన ఎప్పుడూ కుంగిపోలేదు. తనదైన ప్రత్యేక శైలిని ఏర్పరచుకుని, స్టార్ హీరోగా ఎదిగారు. ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా ‘కల్కి’ వంటి చిత్రాల్లో పవర్‌ఫుల్ పాత్రలు పోషిస్తూ తన ఉనికిని చాటుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలు ఆశించినంత ఫలితాలు అందుకోవడం లేదు. తమిళ్ సినిమా లబ్బర్ పందు రీమేక్ ఆ మధ్య మొదలైంది కానీ ఆయన గాయపడటంతో సినిమా చిత్రీకరణ ఆపేశారు ఆ సినిమాలో ఆయన కుమార్తె కూడా నటిస్తుండటం గమనార్హం.

ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus