హీరో రామ్ న్యూ లుక్ సినిమా కోసం కాదట

  • July 12, 2016 / 12:52 PM IST

యంగ్ అండ్ ఎనర్జిటిక్  హీరో రామ్ అచ్చ తెలుగు కుర్రోడిగా కనిపించారు. ఈ కొత్త లుక్ సినిమా కోసం మాత్రం కాదు అని అతనే చెప్పేసారు. నేను శైలజ సినిమా విజయంతో ఫుల్ జోష్ లో ఉన్న ఈ హీరో ప్రస్తుతం  సంతోష్ శ్రీనివాసన్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. 50 శాతం చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్ర షూటింగ్ కి కొంత గ్యాప్ ఇచ్చి రామ్ స్నేహితుడి పెళ్లికి బయలు దేరారు. తెల్ల షర్టు, తెల్ల పంచె కట్టుతో మెరిసి పోతున్నారు.

“నా బెస్ట్ ఫ్రెండ్ పెళ్లి ఈ రోజు తెల్లవారు జామున 4 గంటలకు ఉంది. నిద్ర మత్తులోనే రెడీ అయ్యాను” అని రామ్ ట్విట్ట‌ర్ ద్వారా తెలిపారు. తన ఫోటోను కూడా పోస్ట్ చేశారు. ఇందులో రామ్ చాలా హ్యాండ్ స‌మ్ గా ఉన్నారు. కొత్త సినిమాలోనూ ఇంతే అందంగా కనిపించి మరో హిట్ ను సొంతం చేసుకోవడం గ్యారంటీ అని రామ్ అభిమానులు సంబర పడిపోతున్నారు.

14 రీల్ వారు నిర్మిస్తున్న రామ్ 14 వ చిత్రం తర్వాత 15 వ సినిమాను పటాస్, సుప్రీమ్ దర్శకుడు అనిల్ రావి పూడి తో చేయనున్నారు. ఇందులో యంగ్ హీరో అంధుడిగా కనిపించనున్నారు. అయినా అందులో కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కావని డైరక్టర్ స్వయంగా స్పష్టం చేశారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus