టాలీవుడ్ యువ హీరోల్లో డిఫరెంట్ గా అడుగులు వేసేవారిలో రామ్ పోతినేని ఒకరు. కొత్తగా ట్రై చేస్తూనే కమర్షియల్ గా కూడా తన సినిమాలతో బాక్సాఫీస్ హిట్ అందుకోగల రామ్ పోతినేని నెక్స్ట్ రెడ్ వినిమాతో హిట్ అందుకోవాలని అనుకుంటున్నాడు. అసలైతే ఈ సినిమా ఈ ఏడాది సమ్మర్ లోనే భారీ స్థాయిలో విడుదల కావాల్సింది. కరోనా దెబ్బ కొట్టడంతో వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఇక జనవరికి ఆల్ మోస్ట్ రిలీజ్ డేట్ ఫిక్స్ అని అనుకున్నారు.
ఓ వర్గం ఆడియెన్స్ కూడా ఈ సినిమా కోసం బాగానే వెయిట్ చేస్తున్నారు. కానీ రామ్ మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. ఇక సంక్రాంతి సీజన్ లో పోటీ ఎక్కువవ్వడంతో రామ్ మళ్ళీ వెనుకడుగు వేసినట్లు తెలుస్తోంది. పోటి పడటం రిస్క్ అని అలెర్ట్ అయ్యాడు. అందుకే సినిమాను కూల్ గా సమ్మర్ లో విడుదల చేసుకోవాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన రూమర్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి.
ఇక ఇస్మార్ట్ శంకర్ సినిమాతో గత ఏడాది బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్ అందుకున్న రామ్ ఈ సినిమాతో కూడా అంతకంటే హై రేంజ్ లో హిట్ కొట్టాలని చూస్తున్నాడు. మరి సినిమా ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి.
Most Recommended Video