పూరీ రుణం రొమాంటిక్ తో తీర్చుకుంటున్న రామ్!

  • December 5, 2019 / 12:32 PM IST

అసలు కనీస స్థాయి హిట్ అవుతుందన్న నమ్మకం కూడా లేకుండా విడుదలైన “ఇస్మార్ట్ శంకర్” అఖండ విజయం సొంతం చేసుకొని రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఆ సినిమా సాధించిన సక్సెస్ తో పూరీ అప్పులన్నీ తీరిపోవడమే కాదు మరో నాలుగైదు సినిమాలు నిర్మించేంత సొమ్ము సంపాదించుకొన్నాడు. అప్పటివరకూ యావరేజ్ హిట్ కూడా లేక ఇబ్బందిపడుతున్న రామ్ కి “ఇస్మార్ట్ శంకర్” ఏకంగా కెరీర్ బెస్ట్ బ్లాక్ బస్టర్ ను ఇచ్చింది.

అందుకే పూరీ రుణం తీర్చుకోవడం కోసం ఆయన నిర్మాణంలో పూరీ కుమారుడు ఆకాష్ కథానాయకుడిగా రూపొందుతున్న “రోమాంటిక్” చిత్రంలోని ఒక స్పెషల్ సాంగ్ లో స్టెప్పులతో మెరవడానికి ఒకే చెప్పాడట రామ్. వచ్చేవారం షూట్ చేయనున్న ఈ ఐటెమ్ సాంగ్ లో ఇస్మార్ట్ శంకర్ రామ్ తన మెస్మరైజింగ్ డ్యాన్స్ మూమెంట్స్ తో అలరించనున్నాడు. మరి రామ్ డ్యాన్స్ రోమాంటిక్ సినిమాకి ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాలి.

అర్జున్ సురవరం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజా వారు రాణి గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus