కోహ్లీ వ్యాఖలకు గట్టి కౌంటర్ ఇచ్చిన సిద్ధార్ధ్

  • November 10, 2018 / 11:01 AM IST

ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇటీవల “ఇండియన్ బ్యాట్స్ మెన్ ప్లేయింగ్ నచ్చని వాళ్ళందరూ ఇండియా వెళ్లిపోవాలి” అంటూ కామెంట్ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై విరాట్ ను చాలామంది ట్రోల్ చేశారు. కొన్ని వేల మీమ్స్ పుట్టుకొచ్చాయి. అయినప్పటికీ.. తాను తన మాట మీద నిలబడుతున్నానని, మాట వెనక్కి తీసుకొనే ప్రసక్తి లేదని తేల్చి చెప్పాడు అయితే.. విరాట్ చేసిన వ్యాఖ్యలకు సినిమా పరిశ్రమ నుంచి కానీ.. రాజకీయవేత్తల నుంచి కానీ ఎలాంటి కౌంటర్ రాలేదు. కానీ.. హీరో సిద్ధార్ధ్ ఒక్కడే కాస్త ఘాటుగా స్పందించాడు.

విరాట్ చేసిన కామెంట్స్ ఇడియాటిక్ అని కామెంట్ చేయడమే కాక.. కింగ్ కోహ్లీ అని తనని తాను అనుకొనే వ్యక్తి మాటలు చాలా జాగ్రత్తగా వాడాలని కూడా వ్యాఖ్యానించాడు సిద్ధార్ధ్. సిద్ధార్ధ్ కి పాజిటివ్ గా స్పందించినవారికంటే, నెగిటివ్ గా కామెంట్ చేసినవాళ్లే ఎక్కువ. అయినప్పటికీ.. కొందరు మాత్రం సిద్ధార్ధ్ ధైర్యాన్ని మెచ్చుకొంటున్నారు. ఏదేమైనా.. ఓ క్రికెట్ దిగ్గజాన్ని తనదైన శైలి ట్వీట్స్ తో కడిగిపారేసిన సిద్ధార్ధ్ ను మరికొందరు కూడా కోహ్లీని ప్రశ్నించడానికి ముందుకు రావడం మెచ్చుకోదగ్గ అంశం. ఇకపోతే.. సిద్ధార్ధ్ ప్రస్తుతం రెండు సినిమాల ప్రీప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నాడు. నెట్ ఫ్లిక్స్ కోసం కూడా ఒక సిరీస్ చేస్తున్నాడు సిద్ధార్ధ్.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus