తరుణ్ కొత్త అవతారం.. వర్కవుట్ అవుతుందా..?

  • October 31, 2020 / 04:08 PM IST

చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తరుణ్ ఎన్నో సినిమాల్లో నటించారు. ‘అంజలి’, ‘ఆదిత్య 369’ లాంటి సినిమాల్లో బాలనటుడిగా మెప్పించాడు. ఆ తరువాత హీరోగా మారి లవర్ బాయ్ ఇమేజ్ సంపాదించుకున్నాడు. అప్పట్లో తరుణ్ కి అమ్మాయిల్లో ఫాలోయింగ్ ఓ రేంజ్ లో ఉండేది. వరుసగా హిట్లు అందుకుంటూ స్టార్ హీరో హోదా ఎంజాయ్ చేశాడు. అయితే ఆ తరువాత వరుస డిజాస్టర్లు రావడంతో అతడికి అవకాశాలు తగ్గాయి. మెల్ల మెల్లగా ఫేడవుట్ అయిపోయాడు.

కానీ హీరోగా నటించాలనే ఆసక్తితో రెండేళ్ల క్రితం ‘ఇది నా లవ్ స్టోరీ’ అంటూ ఓ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఆ సినిమా కూడా అట్టర్ ఫ్లాప్ కావడంతో ఇక హీరోగా సినిమాలు చేయడం మానేయాలని నిర్ణయించుకున్నాడట. ఈ క్రమంలో తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టబోతున్నాడని సమాచారం. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఆయన మూడు ప్రాజెక్ట్ లను టేకప్ చేశారని సమాచారం. అయితే నటుడిగా మాత్రం కాదట.

నిర్మాతగా మారి సినిమాలు చేయాలని తరుణ్ నిర్ణయించుకున్నారట. ఇప్పటివరకు వ్యాపారం ద్వారా సంపాదించిన మొత్తాన్ని సినిమాలపై పెట్టుబడులు పెట్టబోతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో మూడు ప్రాజెక్ట్ లను ఎన్నుకున్నారట. అందులో రెండు ఓటీటీ రిలీజ్ ల కోసం చేస్తుండగా.. మరొకటి థియేట్రికల్ రిలీజ్ కోసం చేస్తున్నట్లు సమాచారం. మరి ఈ విషయాన్ని తరుణ్ అధికారికంగా ప్రకటిస్తారేమో చూడాలి!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus