NKR x AR: కల్యాణ్‌ రామ్‌ కంటే ముందు ఈ కథలో వచ్చింది ఎవరెవరో తెలుసా?

‘‘మొదటిసారి సినిమా తీసే అవకాశమిచ్చిన హీరో కల్యాణ్‌రామ్, మొదటి రూ.వంద కోట్ల సినిమా ఇచ్చిన హీరో వెంకటేశ్‌తో కలసి 2027 మొదటి పండక్కి మీ ముందుకొస్తున్నా’’ అని అనిల్‌ రావిపూడి తన సోషల్‌ మీడియా పోస్టులో ఘనంగా రాసినప్పటికీ.. ఆ ‘మొదటి సారి అవకాశమిచ్చిన హీరో’ లైన్‌ ఆఖరులో యాడ్‌ అయింది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు అనిల్‌ అనౌన్స్‌ చేసిన సినిమాలో వెంకటేశ్‌తోపాటు నటించబోయే హీరో పాత్ర కోసం కొంతమంది నటుల్ని అనుకున్నారు. అందులో ఇతర భాషలకు చెందినవాళ్ల కూడా ఉన్నారు.

NKR x AR

బావాబామ్మర్ది కథతో అనిల్‌ రావిపూడి ఓ సినిమా తీస్తారని ఆ మధ్య వార్తలొచ్చాయి. ఆ లెక్కన సినిమాలో ఇద్దరు హీరోలు ఉంటారని కూడా చెప్పుకొచ్చారు. అయితే తానింకా పేపర్‌ మీద పెన్ను కూడా పెట్టలేదని అనిల్‌ కౌంటర్‌ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌ అయింది. అందులో ఇద్దరు హీరోలు ఉన్నారు. ఒకరు సీనియర్‌ హీరో, మరొకరు యంగ్‌ హీరో. ఈ లెక్కన ఇది బావాబామ్మర్ది కథ అవ్వొచ్చు అని చెబుతున్నారు. ఇందులో బావ వెంకటేశ్‌ కాగా, బామ్మర్తి కల్యాణ్‌ రామ్‌ అవ్వొచ్చు అని సమాచారం.

ఈ యంగ్‌ హీరో పాత్ర గురించి చూస్తే.. ఈ పాత్రను తొలుత ఇతర భాషల సినిమాల హీరోతో చేయిద్దాం అనుకునేరు. ఆ లెక్కన మల్టీస్టారర్‌ విత్ మల్టీ లాంగ్వేజ్‌ సినిమా అయ్యేది. దీంతో మలయాళ స్టార్‌ ఫహాద్‌ ఫాజిల్‌ పేరు ప్రముఖంగా వినిపించింది. ఆ తరువాత తమిళ హీరో కార్తి పేరు వచ్చింది. అయితే ఇద్దరూ ఓ దశ వరకు వచ్చి సినిమా వద్దనుకున్నారు. దీంతో అనిల్‌ తన తొలి హీరో దగ్గరకు వచ్చేశాడు. అలా ఈ సినిమా అనౌన్స్‌ అయింది అని అంటున్నారు.

ఈ సినిమా గురించి వెంకటేశ్‌ మాట్లాడుతూ మేం ఇద్దరం కలసి ఐదో సినిమా చేస్తున్నాం. ఈ ప్రయాణంలో కల్యాణ్‌రామ్‌ మాతో చేరడం ఆనందంగా ఉంది. పండక్కి కలుద్దాం అని పోస్ట్‌ చేశారు. ‘పటాస్‌’ సినిమా తర్వాత మీతో కలవడం ప్రత్యేకంగా అనిపిస్తోంది. ఈసారి వెంకటేశ్‌తో ఓ సూపర్‌ ఎంటర్‌టైనర్‌కి సిద్ధం. అని కల్యాణ్‌రామ్‌ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.

 ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus