రామ్ చరణ్, బోయపాటి సినిమాలో హీరోయిన్ ఫిక్స్

  • January 18, 2018 / 09:31 AM IST

మాస్ అభిమానులకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మంచి విందు ఇవ్వనున్నారు. మాస్ డైరక్టెర్ బోయపాటి శ్రీనుతో కలిసి భారీ యాక్షన్ సినిమాని చేయబోతున్నారు. కొన్ని రోజుల క్రితం లాంఛనంగా ప్రారంభమైన ఈ మూవీ రేపటి నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది. బోయపాటి సినిమాలో హీరోతో పాటు విలన్ ని కూడా బాగా పవర్ ఫుల్ గా చూపిస్తారు. ఇందులో ఎవరు విలన్ గా నటించనున్నారో అన్న సంగతిని చాలా సీక్రెట్ గా దాచి ఉంచారు. అయితే హీరోయిన్ ఎవరో బయటికి వచ్చింది. బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీని హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్లు తెలిసింది. ధోని బయోపిక్ సినిమా తో పాపులర్ అయిన ఈ సుందరి తెలుగులో మహేష్ సినిమా ద్వారా పరిచయం అవుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భరత్ అనే నేను సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

ఈమె నటన, డెడికేషన్ మెచ్చి.. ఈమూవీ రిలీజ్ కాకముందే బోయపాటి ఆమెను సెలక్ట్ చేసారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ రాజ వంశస్థుడిగా అంటే యువరాజుగా కనిపించనున్నారు. అలాగే కైరా అద్వానీ యువరాణిగా కనిపించబోతున్నట్లు అర్ధమవుతోంది. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ చేస్తున్న రంగస్థలం ప్రొడక్షన్ అనంతరం పనులను జరుపుకుంటోంది. టాలీవుడ్ క్యూట్ బ్యూటీ సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా మార్చి 30 న విడుదల కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus