కుర్ర హీరోకి సీనియర్ హీరోయిన్స్ అవసరమా?

అప్పుడెప్పుడో వచ్చిన “వెంకటాద్రి ఎక్స్ ప్రెస్” మినహా కెరీర్ మొత్తంలో చెప్పుకోదగ్గ విజయం ఒక్కటి కూడా లేని సందీప్ కిషన్ అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉన్నాడు కానీ.. సరైన సక్సెస్ మాత్రం సొంతం చేసుకోలేకపోయాడు. దానికి తోడు ఈమధ్యకాలంలో సందీప్ కిషన్ హీరోయిన్స్ సెలక్షన్ చాలా బ్యాడ్ గా ఉంటోంది. వయసులో కాకపోయినా.. సీనియారిటీలో తనకంటే పెద్ద హీరోయిన్స్ ను సెలక్ట్ చేసుకొని తన సినిమాలకు తానే విలన్ గా మారుతున్నాడు. రేపు విడుదలకానున్న “నెక్స్ట్ ఏంటీ”లో తమన్నా,, తదుపరి చిత్రం “తెనాలి రామకృష్ణ”లో హన్సికలు కథానాయికగా సెలక్ట్ చేసుకున్నాడు సందీప్ కిషన్.

ఇద్దరూ కెరీర్ ల పరంగా సందీప్ కంటే సీనియర్సే, ఇంకో విషయం ఏంటంటే.. ప్రస్తుతం ఆ ఇద్దరు హీరోయిన్స్ కి ప్రత్యేకమైన మార్కెట్ కానీ క్రేజ్ కానీ లేదు. కానీ.. సందీప్ కిషన్ మాత్రం వెతికి మరీ సీనియర్ హీరోయిన్స్ ను సెలక్ట్ చేసుకొని సినిమా విడుదల సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ సీనియర్ హీరోయిన్స్ వల్ల ఇబ్బంది ఏమిటంటే.. సినిమా విడుదల సమయంలో వాళ్ళ సీనియారిటీ కానీ గ్లామర్ కానీ సందీప్ కిషన్ ను మొత్తానికి సైడ్ లైన్ చేసేస్తున్నాయి. ఇకనైనా సందీప్ కిషన్ హీరోయిన్ క్రేజ్ ను కాక తన సామర్ధ్యాన్ని, కథను బట్టి హీరోయిన్స్ ను సెలక్ట్ చేసుకుంటాడేమో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus