వాళ్ళిద్దరినీ అస్సలు కన్సిడర్ కూడా చేయలేదట

  • November 28, 2019 / 11:11 AM IST

ఇస్మార్ట్ శంకర్ సాధించిన అఖండ విజయంలో తమ అందాలతో కీలకపాత్రలు పోషించిన నభా నటేష్, నిధి అగర్వాల్ లు ఆ విజయాన్ని బాగానే క్యాష్ చేసుకొన్నారు. ఇద్దరూ ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హాట్ హీరోయిన్స్. అయితే.. ఈ ఇద్దరు మళ్ళీ కలిసి ఒక సినిమాలో కనిపించనున్నారని టాక్ నిన్నట్నుండి హల్ చల్ చేస్తుంది. వరుణ్ తేజ్ కథానాయకుడిగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కనున్న బాక్సింగ్ నేపధ్యం చిత్రానికి కథానాయికగా తొలుత పలువుర్ని కన్సిడర్ చేసినప్పటికీ డేట్స్ ఖాళీ లేక వాళ్ళు కాదన్నారు. కైరా అద్వానీని ఫిక్స్ చేద్దాం అనుకుంటే.. అమ్మడు కూడా కష్టమని చెప్పేసింది.

దాంతో.. ఈ సినిమాలో హీరోయిన్స్ గా నిధి, నభాలను ఫిక్స్ చేశారని తెగ వార్తలొచ్చాయి. అయితే.. వాటిలో నిజం లేదని, అసలు నిధి-నభాలను కనీసం అప్రోచ్ అవ్వడం కానీ.. కన్సిడర్ చేయడం కానీ జరగలేదని చిత్రబృందం కన్ఫర్మ్ చేసింది. దాంతో నిన్నట్నుంచి హల్ చల్ చేస్తున్న వార్తలన్నీ గాసిప్పులే అని తేలిపోయింది.

“జార్జ్ రెడ్డి” సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ సాధించిన సౌత్ సినిమా టీజర్లు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus