రెండు తరాల హీరోలతో రొమాన్స్

  • November 2, 2016 / 09:32 AM IST

నిజజీవితానికి, సినిమాలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. రియల్ లైఫ్ లో రిలేషన్ బట్టి మర్యాదలు పెరుగుతుంటాయి. రీల్ లైఫ్ లో పాత్రలకు తగినట్లు పెర్ఫార్మెన్సెస్ మారుతుంటాయి. టాలీవుడ్ లో నటుల మధ్య ఉండే రిలేషన్స్ ని పట్టించుకుంటే హీరోయిన్లకు చాలా కష్టం. ఎందుకంటే ఇక్కడ కొన్ని ఫ్యామిలీలో ఎక్కువమంది హీరోలుగా రాణిస్తున్నారు. అందుకే అందమైన భామలు బాబాయ్, అబ్బాయి అని తేడా లేకుండా ఇద్దరితోను రొమాన్స్ చేస్తున్నారు. ఇలా రెండు తరాల హీరోలతో ఆడిపాడిన నేటి తారలపై ఫోకస్..

కాజల్ అగర్వాల్టాలీవుడ్ లో ప్రస్తుతం ఎక్కువ రేమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఈమె మొదట మగధీర చిత్రంలో రామ్ చరణ్ తో రొమాన్స్ చేసింది. ఆ చిత్రం సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత చెర్రీ బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన “సర్దార్ గబ్బర్ సింగ్” మూవీలో నటించింది. అల్లు అర్జున్ తో ఆర్య 2 కూడా చేసింది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో ఖైదీ నంబర్ 150 లో ఆడి పాడనుంది. ఒకే కుటుంబంలో నలుగురితో నటించిన ఏకైక నటి కాజల్.

త్రిషచెన్నై భామ త్రిష దమ్ము చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో పోటీపడి నటించింది. తారక్ బాబాయ్ అయిన నటసింహ బాలకృష్ణతో లయన్ సినిమాలో ఉర్రూతలూగించింది.

సమంతక్రేజీ హీరోయిన్ సమంత మెగా ఫ్యామిలీలోని రెండు తరాల హీరోలతో నటించింది. అత్తారింటికి దారేది సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ప్రేమ కురిపించిన ఈ సుందరి.. సన్నాఫ్ సత్యమూర్తిలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో ప్రేమను పండించింది.

ఛార్మిబొద్దుగా ముద్దొచ్చే మహా..మహా ముద్దుగుమ్మ ఛార్మి నందమూరి రెండు జనరేషన్ల హీరోలతో జోడీగా నటించింది. అల్లరిపిడుగులో బాలయ్య తో డిక్కీ ..డిక్కీ డీడిక్కీ.. అని, రాఖీలో తారక్ తో రాఖీ రాఖీ అంటూ డ్యాన్సులతో అదరగొట్టింది.

ఇలియానసన్నని నడుముతో యువకుల మతి పోగొట్టిన ఇలియాన జల్సా సినిమాలో పవన్ కళ్యాణ్ కి పర్ఫక్ట్ పెయిర్ గా కనిపించింది. అలాగే జులాయి లో అల్లు అర్జున్ కి లవర్ గా మెప్పించింది.

శ్రియ శరణ్తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటి హీరోలందరితో నటించిన భామ శ్రియ శరణ్. చెన్నకేశవరెడ్డి చిత్రంలో బాలయ్య తో హుషారుగా డ్యాన్స్ చేసిన శ్రియ, నా అల్లుడు మూవీలో జూనియర్ ఎన్టీఆర్ తో పోటీపడి స్టెప్పులు వేసింది.

నయన తారబికినీ బ్యూటీ నయన తార దగ్గుబాటి ఫ్యామిలీలో రెండు తరం హీరోలతో నటించింది. విక్టరీ వెంకటేష్ తో కలిసి తులసి, లక్ష్మి, బాబు బంగారం మూవీలు చేసిన ఈ సుందరి, వెంకీ అన్న కొడుకు అయిన దగ్గుబాటి రానాతో కృష్ణం వందే జగద్గురుమ్ సినిమాలో నటించింది.

తమన్నామిల్కీ బ్యూటీ తమన్నా బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అబ్బాయి రామ్ చరణ్ తో పాటు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి నటించింది. కెమెరా మెన్ గంగతో రాంబాబు, రచ్చ, బద్రీనాథ్ చిత్రాల్లో కథానాయికగా అలరించింది.

జెనీలియాదగ్గుబాటు ఫ్యామిలీలో రెండు తరాలను కవర్ చేసిన మరో హీరోయిన్ జెనీలియా. సుబాష్ చంద్ర బోస్ సినిమాలో వెంకటేష్ తో, నా ఇష్టం లో రానా తో కలిసి నటించి ఆకట్టుకుంది.

శృతి హాసన్మల్టీ ట్యాలెంటెడ్ హీరోయిన్ శృతిహాసన్ కూడా మెగా ఫ్యామిలీలో ముగ్గురు హీరోలతో నటించింది. గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్ ని అందంతో పడగొట్టేయగా, రేసుగుర్రంలో అల్లుఅర్జున్ ప్రేమలో పడిపోయింది. ఇక ఎవడు చిత్రంలో రామ్ చరణ్ తేజ్ కి సరిజోడిగా కనిపించింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus